ఏపీ ఎంసెట్-2017 ఇంజినీరింగ్ సోమ, మంగళ, బుధవారాల్లో(ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో) జరగనుండగా.. వ్యవసాయ విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు(బైపీసీ విద్యార్థులకు) శుక్రవారం(ఏప్రిల్ 28) ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్న ఏపీ ఎంసెట్-2017కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం నిబంధన విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది.


Image result for ap eamcet

సహేతుకమైన కారణం ఉంటే 1, 2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని, మరీ ఆలస్యంగా వస్తే అనుమతించబోమని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం(ఏప్రిల్ 23) సాయంత్రం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఏదైనా తప్పిదం జరిగితే ఇన్విజిలేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రశాంత వాతావరణంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. కాకినాడ జేఎన్‌టీయూ ఆవరణలో తాను ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షను ప్రారంభిస్తానని చెప్పారు. భవిష్యత్తులో పోటీ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని వెల్లడించారు. ఇంజినీరింగ్‌కు రాష్ట్రంలో 124 పరీక్షా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లో నాలుగు కేంద్రాలు, వ్యవసాయ విద్య, ఇతర పరీక్షలకు రాష్ట్రంలో 133 కేంద్రాలు, హైదరాబాద్‌లో 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: