పీజీ వైద్య విద్య ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఫీజులు పెంచాలని డిమాండ్‌ చేస్తున్న ప్రైవేటు వైద్య కళాశాలలు, అప్పటి వరకు సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌కు కూడా సహకరించబోమని స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల భర్తీకి మాత్రమే కౌన్సెలింగ్‌ చేపట్టి, పీజీ వైద్య విద్య సీట్లు పొందిన 677 మంది విద్యార్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ సీట్ల భర్తీ చేపట్టడానికి ముందు ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచాలని ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించడంతో, తెలంగాణ కూడా ఆ దిశలో యోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: