కాకతీయ వర్సిటీలో లంచాలిచ్చి పీహెచడీ సీట్లు కొనుక్కోవడంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘పీహెచ్‌డీ ఫర్‌ సేల్‌’ కథనం విశ్వవిద్యాలయాన్ని కుదిపేసింది. ఆంధ్రజ్యోతి-ఏబీఎన జాయింట్‌ ఆపరేషనలో దందా బయట పడటంతో సంబంధిత వర్గాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే స్పెషల్‌ బ్రాంచ్‌, నిఘా విభాగం ప్రతినిధులు రంగంలోకి దిగారు. దళారుల వెనక ఉన్న ప్రొఫెసర్లు ఎవరనే దానిపై ఆరా తీసి, ప్రాథమిక నివేదిక పంపారు. అక్రమాల నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ ప్రకటించారు. వర్సిటీలోని డీన్లు, సీనియర్‌ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారని చెప్పారు. దోషులుగా తేలినవారిపై వర్సిటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహిస్తామని ప్రకటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: