తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఆయారాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం అహర్శిశలూ శ్రమిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజధానిలో పెట్టుబడులను ఆకర్శించడం కోసం విదేశీ పర్యటన చేపట్టారు.


ఏపీలో విద్యాభివృద్దికి  ప్రత్యేక సంస్కరణలు చేపడుతున్నారు. టెక్నాలజీ రంగంలో ముందంజ ఉండాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని సీఎం ముఖ్య ఉద్దేశ్యం. తాజాగా ఏపీలో ప‌రిశోధ‌న రంగంలో నిధులు ఇచ్చేందుకు రైట్ స్టేట్ వ‌ర్సిటీ ఆస‌క్తి చూపింది.  ఈ మేరకు ఒహియోలోని రైట్ స్టేట్ వర్సిటీ డైర‌క్టర్లతో మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా ఒహియో వర్సిటీల్లో ఏపీ విద్యార్థులకు ఫీజు రాయితీపై ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రాడ్యుయేష‌న్, అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్, పీహెచ్‌డీ కోర్సుల్లో ఫీజు రాయితీ ఇచ్చారని... జ‌న‌వ‌రి నుంచి ఫీజు రాయితీ అమ‌ల్లోకి రానుందని మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: