జాతీయ బ్యాంకులతో పాటు పలు ఇతర బ్యాంకుల్లోను స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 27, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం1315 ఖాళీలకి గాను ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
నిర్వహించే వారు : ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్)
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్
ఖాళీలు: 1315
జాబు చేయు ప్రదేశం : ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: నవంబర్ 27, 2017
పోస్టు పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్స్(సీఆర్పీ ఎస్పీఎల్--VII)
1) ఐటీ ఆఫీసర్(స్కేల్ I): 120 పోస్టులు
2) అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్((Scale I): 30 పోస్టులు
3) రాజ్ భాష అధికారి( స్కేల్ I): 60 పోస్టులు
4) లా ఆఫీసర్( స్కేల్ I): 35 పోస్టులు
5)హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I): 35 పోస్టులు
6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్ I): 195పోస్టులు
విద్యార్హత:
సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా పీజీ చేసి ఉండాలి. లేదా డిగ్రీతో పాటు డీఓఈఏసీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ క్లాసెస్) బి లెవల్/ అగ్రికల్చర్ ఆఫీసర్- అగ్రికల్చర్ విభాగంలో నాలుగేళ్ల డిప్లోమా(Scale-I)/పీజీ- రాజ్ భాష అధికారి/ఎల్ఎల్‌బి-బార్ కౌన్సిల్ లా/పర్సనల్ ఆఫీసర్/ఎంబీఏ/2సం.పీజీడీబీఏ/పీజీడీబీఎం-మార్కెటింగ్ ఆఫీసర్
వయోపరిమితి: నవంబర్ 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 20-30సం. ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎగ్జామినేషన్(ప్రిలిమినరీ), రాతపరీక్ష II(మెయిన్స్),వ్యక్తిగత ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 7, 2017
దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 27, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/naA8kF