భారత దేశంలో గత కొంత కాలంగా విద్యావ్యవస్థ పూర్తిగా కమర్షియల్ గా మారిపోయిందని ప్రైవేట్ విద్యాసంస్థలు చూస్తుంటే తెలిసిపోతుంది.  తల్లిదండ్రులు తాహతకు మించి తమ పిల్లల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు.  దీంతో అడ్డగోలు ఫిజుతో యాజమాన్యం తల్లిదండ్రుల వద్ద అందినంత దోచుకుంటున్నారు.  మరోవైపు ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలపై కొరడా ఝులిపిస్తూనే ఉన్నారు. 

తాజాగా ఇంజనీరింగ్ విద్య నాణ్యత విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు పలు అంశాలను ప్రస్తావిస్తూ, యూజీసీకి ప‌లు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో స్పందించిన యూజీసీ దేశ వ్యాప్తంగా దాదాపు 120 విద్యాసంస్థ‌ల‌కు యూనివ‌ర్సిటీ హోదాను ర‌ద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుస‌రిస్తూ దూరవిద్య విధానం ద్వారా 4 విద్యాసంస్థ‌లు జారీ చేసిన ఇంజ‌నీరింగ్ ప‌ట్టాలు ర‌ద్దు అయ్యాయి. కాకపోతే విద్యా సంస్థ‌లు అన్నీ య‌థావిధిగా ప‌నిచేయ‌వ‌చ్చు.

హోదా కోల్పోయిన‌ విద్యాసంస్థ‌ల పేరు చివ‌ర యూనివ‌ర్సిటీ అన్న పదం ఉండ‌కూడ‌దు. ఆయా విద్యా సంస్థ‌లు ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల ప‌రిధిలో ప‌నిచేయాలి, అంటే ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల అనుబంధంగా న‌డ‌పాల్సి ఉంటుంది. 


వ‌ర్సీటీ హోదా కోల్పోయిన ప‌లు విద్యా సంస్థ‌లు :


ఎస్‌.ఆర్‌.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ

శ్రీ స‌త్య‌సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ‌య్య‌ర్ ల‌ర్నింగ్‌, అనంత‌పురం

విజ్ఞాన్ ఫౌండేష‌న్ ఫ‌ర్ సైన్స్‌, టెక్నాల‌జీ రీసెర్చ్‌, గుంటూరు. 

వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (విట్)

గీతం, విశాఖ ప‌ట్నం

మరింత సమాచారం తెలుసుకోండి: