ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈఎన్‌సీవో- ఎపీజెన్‌కో) 51 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ,ట్రైనీ జూనియర్ అసిస్టెంట్లు పోస్టులకి గ్రీన్ సింగల్ ఇచ్చింది..

Image result for apgenco

పోస్టు పేరు-ఖాళీలు:  ట్రైనీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (టీజేఏవో)-26; ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ (టీజేఏ)-25. 


వేతన శ్రేణి:     టీజేఏవోకు రూ.34,630- రూ.56,760;  టీజేఏకు రూ.18,725- రూ.34,775. 
అర్హతలు:    టీజేఏవో పోస్టులకు బీకాం/ఎంకాం/ ఐపీసీసీ (చార్టెర్డ్ అకౌంట్స్)/ ఇంటర్ (కాస్ట్ అకౌంటెంట్స్)/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత; టీజేఏ పోస్టులకు బీఏ/ బీకాం/ బీఎస్సీ/ తత్సమాన విద్యతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

 

వయసు :   2017, అక్టోబర్ 1 నాటికి 34 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేర సడలింపు. 
దరఖాస్తు ఫీజు: ఓపెన్ కేటగిరీ/ ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.500 (ఎగ్జామినేషన్ ఫీ- రూ.350+ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ-రూ.150); ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.150 (అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే).

ఎంపిక విధానం:  రాతపరీక్ష. 

రాతపరీక్ష విధానం:   ఇందులో నాలుగు సెక్షన్లు (ఏ,బీ,సీ,డీ) ఉంటాయి. ఈ సెక్షన్లలోని ప్రశ్నలు టీజేఏవో పోస్టులు, టీజేఏ పోస్టులకు వేర్వేరుగా ఉంటాయి. టీజేఏవో పోస్టులకు.. సెక్షన్ ’- కోర్ అకడమిక్ కరిక్యులమ్, సెక్షన్ బి’-కంప్యూటర్ అవేర్‌నెస్, సెక్షన్ సి’-అనలిటికల్ ఆప్టిట్యూడ్, సెక్షన్ డి’- లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ (వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్); టీజేఏ పోస్టులకు.. సెక్షన్ ’-న్యూమెరికల్ ఎబిలిటీ, సెక్షన్ బి’-లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ (వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్), సెక్షన్ సి’- కంప్యూటర్ అవేర్‌నెస్, సెక్షన్ డి’-జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. 

ప్రతి సెక్షన్‌లో కనీసం 30 శాతం మార్కులు వచ్చిన వారినే క్వాలిఫైడ్‌గా పరిగణిస్తారు.

రాత పరీక్షలో ఓసీ-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాలి.

రాతపరీక్ష మార్కుల మెరిట్, ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

 

రాత పరీక్ష కేంద్రం:           విజయవాడ.
దరఖాస్తు విధానం:          ఏపీ జెన్‌కో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తుకు చివరి తేదీ:    డిసెంబర్ 2, 2017 
రాతపరీక్ష తేదీ:              డిసెంబర్ 12, 2017

మరిన్ని వివరాలకోసం
వెబ్‌సైట్apgenco.cgg.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: