తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలో ఉన్న భోదనాస్పత్రులలో సుమారు  2108 పారామెడికల్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు బుదవారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు..వీటిలో 1603 స్టాఫ్‌ నర్సులే..డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని మొత్తం 7 కాలేజీల్లో ఉన్న ఈ ఖాళీలను TSPSC ద్వారా భర్తీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..రాష్ట్రంలో మరో రెండు వైద్య కళాశాలలు ఏర్పాటుకానున్న నేపథ్యంలో సిబ్బంది కొరత ఎదురుకాకుండా ఉండేందుకే ముందుగానే  ఇంతమంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించబోతున్నట్టు తెలిసింది.

 Image result for tspsc office

అయితే  వైద్యుల పోస్టులు లేకుండా కేవలం పారామెడికల్‌ సిబ్బంది నియామకం కోసం జీవో విడుదలవడం ఇదే తొలిసారి అని ఉన్నతాధికారులు చెబుతున్నారు.ఏది ఏమైనా సరే ఎప్పటినుంచో సంభందిత కోర్సులు చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధులకి ఇది మంచి కబురు అని చెప్పాలి.

 

భర్తీ కానున్న పోస్టులు:

స్టాఫ్ నర్స్ లు 1603

టెక్నికల్ అసిస్టెంట్లు 110

టెక్నిషియన్స్ 61

గ్రేడ్ 2 ఫార్మసిస్టులు 58

ల్యాబ్ టెక్నిషియన్స్ 39

జూనియర్ అసిస్టెంట్లు 30

డార్క్ రూం అసిస్టెంట్లు 26

రేడియోగ్రాఫర్స్ 18

మెటర్నిటీ అసిస్టెంట్లు 15

అనస్థీషియా టెక్నిషియన్స్ 10

స్టోర్ కీపర్లు/రికార్డ్ క్లర్క్/కంప్యూటర్ ఆపరేటర్లు 54 సహా పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

 


మరింత సమాచారం తెలుసుకోండి: