మనం సాధారణంగా ఏవైనా తినే పదార్థాల్లో కాస్త తేడా ఉన్నా అది వెంటనే నాలికపై ప్రభావం చూపుతుంది..దాంతో పాటే చిగుళ్లకు కూడా వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు చాలా సున్ని తమైనవే. చిగుళ్ళు వాపునకు గురి కావడాన్ని వైద్య పరిభాషలో జింజివైటిస్ అంటారు . బాక్టీరియా కారణం గా చిగుళ్ళు దెబ్బ తనడం ద్వారా ఈ వ్యాధి ఏర్పడుతుంది . చిగుళ్ళకు దంతాలకు మధ్య ఉండే సన్నని ఖాళీ స్థలాల్లో ఆహారపు తునకలు పేరుకు పోవడం, దంతాలపై పాచి ఏర్పడటం ద్వార అక్కడ బాక్టీరియా చేరుతుంది. కొన్ని సార్లు వేడి పదార్థాలు, పూర్తిగా చల్లని పదార్థాలు తిన్పపుడు చిగుళ్లపై ప్రభావం చూపిస్తుంది. దంతాలపైన సందుల్లో నిలువ ఉండే పదార్దాలు అతి సుక్ష్మమైన పరిమాణంలో ఉన్నప్పటి కీ వాటిలోకి బాక్టీరియా చేరి రసాయనాలను , విషపదర్దాలను ఉత్పత్తి చేస్తుంటాయి..దీని ఫలితం గా అ దంతాల చుట్టూ ఉన చిగురుభాగం ఎర్రగా కండి , వాపు ఏర్పడుతుంది.ఈ ఇంఫమేషన్ దీర్ఘకాలం పటు కొనసాగితే దవడ ఎముక దెబ్బతిని దంతాలు వదులు గా తయారై వుడిపోయే ప్రమాదం ఉంది.


చిగుళ్లను పరిరక్షించుకోవడానికి చిట్కాలు :


 కొద్దిగా ఉప్పును ఒక గ్లాసు నీళ్ళలో వేసి నోట్లో పోసుకొని పుక్కలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఓరల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఉప్పులుో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చిగుళ్ళను స్ట్రాంగ్ గా మార్చుతుంది మరియు దంతాలు వదలవ్వకుండా నివారిస్తుంది. వదులైన దంతాలకు ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్. 


.లవంగాలు లేదా నూనె: లవంగాలను నోట్లో పెట్టుకోండి లేదా నిదానంగా చప్పరించండి లేదా చిగుళ్ళపై లవంగాల నూనెను రాయండి. ఇది అన్ని రకాల పళ్ళ సమస్యలకు పురాతన కాలంనాటి తేలికైన గృహ వైద్యం. చిగుళ్ళ వాపుకు లవంగం నూనె కూడా అద్భుతంగా సహాయపడుతుంది . నూనెను వాపున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గించుకోవచ్చు.

బేకింగ్ సోడా నోటి ఆమ్లాలలో ఇరుకైన ప్రదేశంలో ఏర్పడిన బాక్టీరియాని చంపుతుంది, వేళ్ళ సహాయంతో దీనిని చిగుళ్ళపై పూయవచ్చు.బేకింగ్ సోడాను పసుపు నీటిలో మిక్స్ చేసి చిగుళ్ళ మీద మసాజ్ చేస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు.  


నిమ్మరసంతో దంతాల వాపు తగ్గించుకోవచ్చు. నిమ్మరసాన్ని బాయిల్ చేసి నీటిలో వేసి ఆ నీటితో నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి. ఈనీటితో ప్రతి రోజూ చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.  


అలోవెరా జెల్ గ్రేట్ హోం రెమెడీ . ఈ జెల్ ను వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల వాపు మరియు నొప్పి తగ్గించుకోవచ్చు. ఈ జెల్ ను అప్లై చేయడం లేదా గార్గిలింగ్ చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. 


సేజ్, పెప్పర్మేంట్ ఆయిల్ ని ఉపయోగించి బ్రష్ చేసినట్లైతే ఇవి నోటిని తాజాగా, శుభ్రంగా ఉంచుతాయి. వాపును తగ్గిస్తాయి . ఈ నూనెలతో రోజూ నోటిని పుక్కలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 


అల్లం పేస్ట్ చేసి కొద్దిగా ఉప్పు చేర్చి ఈ పేస్ట్ ను చిగుళ్ళ వాపు మీద అప్లై చేయాలి . ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది . వాపును కూడా తగ్గిస్తుంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: