పుచ్చ పండులో ఉన్నన్ని నీళ్లు మరే పండులోగాని, కాయలోగాని లేవు. పుచ్చకాయలో పొటాషియం ఎక్కువ ఉన్నది కాబట్టి మూత్రపిండాలు పనిచేయక ఉన్నవారు పుచ్చకాయలు తినరాదు. కానీ మూత్రం సరిగా రానివారు, మూత్రవిసర్జనలో మంట, చురుకులు ఉన్నవారు మూత్రపిండాలలో, మూత్రకోశంలో చిన్నచిన్న రాళ్లు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.


గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. వేసవిలో అతిదాహం, చెమట ద్వారా పోయే ఖణిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ తింటే నివాస్తుంది. అన్ని రకాల జ్వరాలలో పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్దకం ఉన్నవారు. ప్రతిరోజూ పుచ్చకాయ తింటూంటే మలబద్దకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది.  


ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: