మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక్కో సమయంలో వాతావరణ కాలుష్యం కావచ్చు..మనం తినే ఆహార పదార్థాల వల్ల కావచ్చు అనారోగ్యానికి గురికాక తప్పదు. ఇక 40 సంవత్సరాలు దాటాయంటే బీపీ,షుగర్, గుండె సంబంధిత వ్యాధి,కీళ్ల నొప్పులు లాంటివి మొదలవుతాయి. సాధారణంగా మనిషి బ్లడ్ కౌంట్ తక్కువైతే ఎనీమియా అంటే రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

దేహంలో తగినంత ఐరన్‌పాళ్లు లేకపోవడం, విటమిన్ డెఫిషియెన్సీ కూడా దీనికి కారణం. నాలుక, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, గోళ్ళు తెల్లగా పాలిపోయినట్లు ఉండడం ,బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం మొదలైనవన్నీ  రక్త హీనత కి దారి తీసే లక్షణాలు. 


రక్తహీనతను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి :


బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది.


రోజూ తీసుకునే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్ సి ఎక్కువగా వుండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.


సోయాబీన్ దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది.


బీట్ రూట్ లో ఐరన్, ప్రొటీన్ లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. బీట్ రూట్ ఆకులలో విటమిన్ ఎ అధికం. కాబట్టి బీట్ రూట్ రోజూ తినే ఆహారంలో భాగంగా చేసుకోవాలి. 


నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. 


తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్ ఉంటాయి. నీరసంగా అనిపిస్తే గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగవచ్చు. అయితే డయాబెటిస్ ఉంటే మాత్రం తేనె తీసుకోకూడదు.


అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టొమాటోలు తీసుకోవాలి.


మామూలు ఉప్పు బదులుగా ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్త హీనతను నివారించవచ్చని జాతీయ పోషకాహార సంస్థవారు  కనుగొన్నారు.


ఈ ఆహారాలు తింటే బ్లడ్ కౌంట్ మెరుగవుతుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: