అల్లాన్ని ఆహారపధార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎన్నో మానవ ఆరోగ్యానికి అద్వితీయమైన ప్రయోజనాలను చేకూర్చుతుందని అనడంలో ఎంతమాత్రం సందేహ లేదు. ఒక విధంగా అల్లం గొప్ప దివ్యౌషధమనే చెప్పాలి. భోజనానంతరం అల్లం ముక్క నోటిలో వేసుకుంటే అజీర్తీ వలన సంభవించే కడుపునొప్పి, కడుపుబ్బరం సమసిపోతాయి. ఈ అల్లం సాధారణంగా ఉష్ణప్రదేశాలలో పెరుగుతుంది.


ఇది సువాసన కలిగించే సుగంథద్రవ్యం, ఎన్నో సద్గుణాలు కలిగి ఉన్న అల్లం ఆయుర్వేధంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఔషధాలన్నింటిలోనూ ఈ అల్లం అత్యవసరం. అల్లం ఎన్నో వ్యాధులకు మందు : జలుబు, దగ్గు, పైత్యం వంటి సాధారణ వ్యాధులను నివారించాలంటే అరస్పూన్ తేనెలో మరొక అరస్పూన్ అల్లపురసం కలిపి త్రాగితే చాలా వరకూ నివారణ పొందవచ్చు.


పైత్యప్రకోపం వలన కళ్లు తిరగడం, తలబారం అధికంగా ఉన్నట్లైతే ఒక చెంచా నిమ్మరసంలో మరొక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే త్వరలో ఫలితం కనిపిస్తుంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే ఒక చిన్న గ్లాస్ మెంతుల కషాయంలో కొద్దిగా అల్లపురసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే జ్వరం బాధనుంచి విముక్తి పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: