కొత్తిమీర తో ఫలితాలు బోలెడున్నాయ్ ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరబాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది.  రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, అలాగే కిమోథెరపీ(రసాయనాలతో చికిత్స చేయడం) వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది పోరాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.  


దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషదంగా  కూడా వాడవచ్చు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ  సుగంద తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. కొత్తిమీర రసం విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది. గృహ చికిత్సలు అజీర్ణం , వికారం, శరీరంలో మంటలు తాజా కొత్తిమీర రసం అజీర్ణం, వికారం, అర్శమొలలు, వికారం, హెపటైటిస్, అల్సరేటివ్ కోలైటిస్(పెద్ద పేగులో వ్రణం తయారుకావటం) వంటి వ్యాధుల్లో హితకరంగా పనిచేస్తుంది.


అమ్మవారు (స్మాల్‌పాక్స్) కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి, చెంచాడు రసానికి ఒకటి రెండు అరటి ‘గింజలు’ పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారంపాటు తీసుకుంటే స్మాల్‌పాక్స్ వంటి పిడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది. స్మాల్‌పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతులతో తీసి, రెండు కళ్లలోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. 


ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్, కూరల వంటి వాటికి చేర్చుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: