పొట్టు తీసిన శ‌న‌గ‌పప్పును మ‌నం అనేక వంట‌కాల్లో వాడుతుంటాం. కానీ పొట్టు తీయ‌కుండానే ల‌భించే శ‌న‌గ‌ల‌ను లేదా లావుగా ఉండే మ‌రో ర‌క‌మైన కాబూలీ శ‌న‌గ‌ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ శ‌న‌గ‌ల‌ను నాన‌బెట్టి లేదా ఉడ‌క‌బెట్టి లేదంటే మొల‌కల రూపంలో నిత్యం తీసుకుంటే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలో శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


రోజూ మనం తినే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా పప్పు దినుసుల్లో ఎన్నో అద్బుతమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా శనిగ,పెసర్లు లాంటివి మొలకలు తింటే వాటిలో ఉన్న పీచు పదార్ధాలు మనకు ఎన్నో పోషకాలు ఇస్తాయి.  లావుగా  ఉండే కాబూలీ శ‌న‌గ‌ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ శ‌న‌గ‌ల‌ను నాన‌బెట్టి లేదా ఉడ‌క‌బెట్టి లేదంటే మొల‌కల రూపంలో నిత్యం తీసుకుంటే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి.


పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎముక‌లకు పుష్టి క‌లుగుతుంది.
శరీరం మొత్తానికి బలాన్ని ఇవ్వడానికి శనగలు సహాయపడతాయి. ఇందులో పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.


శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.


శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి. నానబెట్టి మొలకలు వచ్చిన శనగలలో పీచుపదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఏ వయస్సు వారు శనగలు తీసుకున్నా త్వరగా అరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.


శనగల్లో ఫ్యాట్ కరిగించే గుణం కూడా మెండుగా ఉంది. వీటిల్లో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ర్టాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.  
 ఐర‌న్‌, ప్రోటీన్లు, మిన‌ర‌ల్స్‌స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌న‌గ‌లు శరీరానికి మంచి శ‌క్తిని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధక వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.


 శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేలా చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గిపోతాయి.


 . శ‌న‌గ‌ల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: