ఈ మద్య మనిషి ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనం తినే ఆహార పదార్ధాలతో ఏదో ఒక లోపం జరుగుతూనే ఉంటుంది.  దీనికంతటికీ కారణం కలుషితమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం. ముఖ్యంగా మనం తినే ప్రతి ఫుడ్ లో  కొలెస్టాల్ కలిగినవి ఉండటం దీంతో బరువు పెరగడం లావు కావడం జరుగుతుంది. మరి మనిషి జీవించాలంటే ఏదో ఒక ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే కాదా మరి అందులో కొలెస్టాల్ కి సంబంధించిన ఉండావా ? అంటే ఉంటాయి కాని మనం కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు నిర్మూలించవచ్చు.

పుట్టగొడుగులు: కొలెస్టరాల్ నిల్వలు తగ్గించడంలో పుట్టగొడుగుల్లోని బి, సి, క్యాల్షియం విటమిన్లతోపాటు ఇతర మినరల్స్ బాగా పనిచేస్తాయి.  

ఓట్ మీల్: దీనిలోని బీటాగ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం స్పాంజివలే పనిచేసి కొలెస్టరాల్ ను గ్రహిస్తుంది.   

క్యారెట్: కొలెస్టరాల్ నిల్వలను తగ్గించడంలో క్యారెట్లోని బీటాకెరొటీన్ తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తింటుంటే శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు పదిశాతం తగ్గుతాయి. 

మిరియాలు: నల్లమిరియాలు శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు బాగా తగ్గిస్తాయి. గుండెను వ్యాధులబారి పడకుండా రక్షిస్తాయి. వీటిలోని కాప్సిసిన్ పెయిన్ కిల్లర్‌గా ఉపయోగపడుతుంది.

ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్‌మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి.

 నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్‌శాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌ను వాడితే మరీ మంచిది.

రోజూ సరిపడా సమయం నిద్రపోవాలి. మంచి నిద్ర వల్ల శరీరం తిరిగి పునరుత్తేజం అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ముప్పు తప్పుతుంది.

మాంసాహారం తక్కువగా తినాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారం బదులుగా చేపలు తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: