ఒబేసిటి.. ఫాస్ట్ పుడ్ కల్చర్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. యాంత్రిక జీవనంలో ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అని ఆలోచించక పోవడంతో.. శరీరంలో కొవ్వును పెంచేస్తున్నాం. పైగా దైనందిన జీవితంలో శారీరక శ్రమ తక్కువ కావడం కూడా అధిక బరువు కు కారణమౌతోంది. ఆ బరువు తగ్గించుకోవాలంటే.. శారీరక శ్రమ చేయాలి. గజిబిజి ఉరుకులపరుగుల జీవితంలో ఎక్సర్ సైజులు చేసే తీరిక ఎవరికి ఉండటం లేదు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా ఉంది. మన వంటింటిలో ఉండే సహజసిద్ధ పదార్దాలను ఉపయోగించి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ పానీయాన్నితయారు చేసుకుని రోజు తీసుకుంటే.. కనీసం 15రోజుల్లో సుమారు 10కిలోల బరువును సునాయాసంగా తగ్గొంచంటున్నారు ఆయుర్వేద వైద్యులు. 


కొవ్వును కరిగించే జ్యూస్ తయారీకి కావాల్సినవి.
1. గ్లాస్ మంచి నీరు (ఫిల్టర్ వాటర్ బెటర్)


2. ఒక టేబుల్ స్పూన్ తేనే


3. అలోవేరా(కలబంద) జ్యూస్ లేదా పేస్ట్ (కల బంద జ్యూస్ ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుంది) (కలబంద కొమ్మలో పేస్ట్ లభిస్తుంది)


4. అర టీస్పూన్ అల్లం పేస్ట్


5. నిమ్మకాయ ముక్క


కొవ్వును కరిగించే జ్యూస్ తయారీ విధానం
గ్లాస్ వాటర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ల కలబంద జ్యూస్ లేదా పేస్ట్ కలపాలి. తరువాత తేనే వేసి, ఆ మిశ్రమంలో నిమ్మరసం పిండాలి. చివరగా అల్లం పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. అంతే కొవ్వును కరిగించే జ్యూస్ రెడీ. దీనిని ఉదయం పరగడపున ఒక గ్లాస్, రాత్రికి మరో గ్లాస్ క్రమం తప్పకుండా తీసుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది.


జ్యూస్ వల్ల లాభాలు

1. అలోవేరా. ఇది సహజసిద్ధమైన ఆయుర్వేద మందులలో రారాజు. ఇందులో 75 రకాల ఔషద గుణాలుంటాయి. ఇది జీవ ప్రక్రియను గాడిలో పెడుతుంది. శరీరంలో ఉత్పతయ్యే చెడు పదార్ధాలను విసర్జించేలా చేస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించేందుకు అలోవేరా తోడ్పడుతుంది.

2. తేనే. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో తోడ్పతుంది. అంతే కాకుండా.. ఇందులోని తీపి పదార్ధం శరీరం అలసిపోకుండా శక్తినిస్తుంది.

3. అల్లం శరీరంలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తుంది. కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది.

4. నిమ్మరసం విషయాని కొస్తే.. ఇందులో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. షుగర్, బీపి, గుండె జబ్బులున్న వారికి ఉపయోగ కరంగా పనిచేస్తుంది. నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, శరీరంలోని వ్యర్ధాలను డీటాక్సిఫై చేస్తాయి.

ఈ నాలుగు సహజ సిద్ధమైన వాటిని ఉపయోగించండి.. మీ బాడిని ఫిట్ గా ఫ్లాట్ గా చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: