సాధారణంగా సెక్స్ లేదా శృంగారం అనే పదాలు నిషేధితాలు. ఇంట్లో చిన్నప్పటి నుంచి పిల్లలను ఈ పదాలకు దూరంగా పెంచుతారు. టీవీల్లో అలాంటి సన్నివేశాలు వచ్చినా.. ఛానల్ మార్చేయడమో.. అక్కడి నుంచి వెళ్లిపో అనడమో జరుగుతూ ఉంటుంది. పిల్లల ముందు పెద్దవాళ్లెవరూ అలాంటి మాటలు మాట్లాడరు. వీటిని ఎందుకో వినొద్దు అంటూ ఉంటారు. పొరపాటున పిల్లలకు ఏదైనా సందేహం వచ్చి అడిగినా.. నోర్మూసుకో… అలాంటివి నీకెందుకు.. అంటూ గద్దిస్తారు..