సీతాఫలం.. ఈ మాట వింటేనే నోరూరిపోతుంది. సంవత్సరం మొత్తం కాసినా.. వద్దనకుండా తినాలనిపించే రుచి సీతాఫలం సొంతం. కానీ ఇది ఒక్క చలికాలంలోనే ఎక్కువగా లభిస్తుంది. సీతాఫలంలో నోరూరించే రుచితో పాటు పుష్కలమైన పోషకాలు కూడా ఉన్నాయి. అమృత ఫలాన్ని తలపించే సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్ అని షుగర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏ పండైనా శరీరానికి కేలరీలతో పాటు తగిన మోతాదులో మాంసకృత్తులను అందిస్తుంది. కానీ సీతాఫలం మాత్రం అందుకు భిన్న. తనలో ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలను కలిగి ఉంది.