ఔషదాలలో అత్యంత  గొప్పగా పేరొంది ‘‘ మహాఔషధం’’ అనే సంస్కృత పేరున్న ఒక గొప్ప వనమూలిక ‘అల్లం’ మన వంటగదిలోకి వచ్చేసరికి దాని ప్రాముఖ్యతని కోల్పోయి కేవలం మషాల దినుసుల్లోనూ ఉండటం,  సాదారణంగా వంటలో వాడే  వంటపదార్ధంగానే మిగిలిపోయింది.

అల్లాన్ని  కేవలం ఆహార పదార్ధంగానే  కాక దానిలోని ఉత్తమ ఔషధగుణాలను మన ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించుకో లేక పోతే దాని విలువ మనకు అర్ధం కాదు..   చాలా వ్యాధులు రాకుండానే నివారణ అయ్యేలా చేయగలిగే ‘మహౌషధి’ అల్లం..  

సమస్తమైన పైత్యపు లక్షణాలకు అల్లం అధ్బతమైన మందు ! కడుపులో వుండే రకరకాల చెడు పదార్ధాలను పరిశుభ్రపర్చగల శక్తి అల్లానికి ఉంది ! పేగుల్లో పెరిగే వాతాన్ని తగ్గిస్తుంది.  సయాటికా నడుం నొప్పి, మోకాళ్లనొప్పులు, మడమశూల, శరీరంలోని జాయింట్లలో నొప్పులు- ఆఖరికి పక్షవాతంతో సహా సమస్త వాత రోగాల్లోనూ అల్లం వాతాన్ని అరికట్టి, వ్యాధి త్వరగా తగ్గేలా చేసేందుకు దోహదపడ్తుంది.

భోజనానికి ముందు అల్లం తినండి ! వ్యాధులు మీ దగ్గరకు రావు..!!

అన్నం తినేప్పుడు మొట్టమొదట ఏ ఆహారపదార్ధం తినాలనే సందేహం ప్రతి ఒక్క ఒక్కరికి వుంటుంది.  అన్నం మీద ఇష్టత కలగాలంటే, నోటికి చక్కగా రుచి తెలియాలంటే, తిన్నది ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా జీర్ణం అయిపోవాలంటే మీరు భోజనానికి ముందు అల్లాన్ని తినాలి. అల్లాన్ని తింటే రోగాలు రాకుండా వుంటాయని ఆయూర్వేద శాస్త్రం చెప్తోంది.

‘‘భోజనాగ్రే సదాపథ్యం లవణార్ధ్రక భక్షణమ్’’ అని శాస్త్రంలో ఉంది.

అల్లాన్ని సన్నగా ముక్కలుగా తరగండి, లేదా మెత్తగా దంచండి.  అందులో  తగినంత ఉప్పు కలపవచ్చు. ఇలా లవణాన్ని కలిపిన అల్లాన్ని ఓ సీసాలో అట్టే పెట్టుకొంటే, వారం రోజుల వరకూ నిలవ వుంటుంది.  ఇలా చేస్తే నొటికి రుచిని పుట్టిస్తుంది. కంఠాన్ని శుద్ధి చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: