చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే! ముఖ్యంగా సూప్‌లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. ప్రోటీన్లు గల గింజధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్‌ పళ్లు తీసుకోవాలి.  కాలానికి అనుగుణంగా శరీరానికి ఏమి  అవసరమో అవి ఆ పళ్లలో ఉంటాయి మరి! వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తినడం, బయటి నీళ్లు తాగడం వంటివి చలికాలం అనికాదు, ఏం కాలంలోనూ మంచిదికాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు.

దుస్తులు: చలి గాలి సోకని మందపాటి దుస్తులు ధరించాలి. దుప్పట్లు, రగ్గులు చలికాలంలో కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తూ గ్లిజరిన్ సబ్బుకుగాని సున్నిపిండిని గానీ వాడాలి. చలికాలంలో సాధారణ సబ్బు వాడకం వలన ముఖం మీద చర్మం బిగుసుకుని బిరుసుగా గరుకుగా ఉంటుంది. అందువలన చలికాలములో సున్నిపిండి, కుంకుడుకాయలతో ఒళ్ళు రుద్దుకోవడం మంచిది. పరిశుభ్రత: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్వెట్టర్లు, రగ్గులు ఎండలో వేస్తుండాలి. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చాలు... చలికాలం చలచల్లగా జారుకోడానికి! 


మరింత సమాచారం తెలుసుకోండి: