రక్తంలో ప్రతీ మనిషికి లక్షన్నర నుంచీ నాలుగున్నర లక్షల వరకూ ప్లేట్ లెట్స్ ఉంటాయి.వీటివల్ల ఉపయోగం ఏమిటంటే మనకి ఏదన్నా దెబ్బ తగిలి రక్తం బయటకి వచ్చినపుడు రక్తాన్ని గెడ్డకట్టేలా, గాయాన్ని వెంటనే తగ్గిపోయేలా చేయడంలో కీలక పాత్ర వీటిదే..అందుకే వీటి సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్ లెట్స్ తగ్గిపోతే మనిషి ప్రాణానికే హాని కలిగే ప్రమాదం ఉంది.. శరీరంపై దద్దుర్లు రావడం, హెపటైటీస్ సి, శరీరంపై ఎర్రని మచ్చలు, లాలాజలంలో రక్తం కనిపించడం, ముక్కు నుంచి రక్తం కారడం, మూత్రం ఎరుపు రంగులో రావడం, విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, విరోచనం నలుపుగా ఉండటం, శరీరం నిస్సత్తువగా మారడం వంటివి జరుగుతాయి.

 Image result for blood platelets

ప్లేట్ లెట్స్ తగ్గకుండా వాటిని వృద్ది చేయాలంటే బొప్పాయి ఆకు.. గోధుమ నారు నుండి తీసే రసం గ్లాసు తాగాలి. బీట్ రూట్.. కలబంద రసం తీసుకోవాలి. నీళ్లు సరిపడా తీసుకోవాలి.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సుమారు 5 నుంచి 6 లీటర్ల వరకు నీటిని తాగాలి. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులని సంప్రదించడం ఉత్తమం అంతేకాకుండా ఇంకొన్ని జాగ్రత్తలు ,ఆహార పద్దతులు పాటించడం ద్వారా కూడా ప్లేట్ లెట్స్ ని వృద్ది  చేసుకోవచ్చు.

 

 చాలా మందికి ఫ్రూట్స్ తినడం ఇష్టం ఉండదు..అలాంటి వారికి పోషక ఆహార లోపం తప్పకుండ ఉంటుంది..యుక్త వయసులో ఈ లోపం కనపడక పోవచ్చు కానీ వయసు మీద పడే కొద్ది వారికి ఈ ప్రభావం తెలుస్తుంది..అంతేకాదు వారి శరీరంలో “ప్లేట్ లెట్స్” స్థాయి కూడా తగ్గుతూ వస్తుంది అందుకే ఎక్కువగా ఫ్రూట్స్ తినడం చాలా మంచిది

 Image result for increase blood platelets

క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది...డ్రై ఫ్రూట్స్ లో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్‌ను నేచురల్‌గా పెంచుతుంది, శరీరంలో నీటి స్థాయిని పడిపోకుండా చేస్తుంది.. ప్లేట్ లెట్స్ ఎక్కువగా లేక భాదపడే వాళ్ళకి బీట్ రూట్ ఎంతో సహాయపడుతుంది.


బొప్పాయి ని రోజు ఆహరం తరువాత తీసుకోవడం వాళ్ళ..శరీరంలో బ్లడ్ కౌంట్ తగ్గకుండా చేస్తుంది.అలాగే ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి..ఇవి సహజసిద్ధంగా ప్లేట్ లెట్స్ పెంచడంలో సహాయపడుతాయి..ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్..రోజుకు రెండుసార్లు ఆప్రికాట్‌ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు...ఐరన్ ఎక్కువగా  ఉండే పండ్ల లో దానిమ్మ ఒకటి ఇది కూడా ప్లేట్ లెట్స్  పెంచడంలో శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో ఎంతో మేలుని చేస్తాయి.

Image result for increase blood platelets

మరింత సమాచారం తెలుసుకోండి: