ఉరుకులు పరుగులు ప్రపంచం..స్త్రీలు కనీసం ఉదయాన్నే లేచి కడుపు నిండా తిని ఉద్యోగానికి వెళ్ళాలి..ఆరోగ్య నియమాలు పాటించాలి అనుకున్నా సరే కుదరని పరిస్థితి..చాలా మంది స్త్రీలు ఉదయాన్నే జాగింగ్ కి వెళ్తూ ఉంటారు..ఆరోగ్య సంరక్షణలో అదొక భాగం కూడా..అయితే చాలా మంది గృహిణులు అయితే ఇంటిపనులు చూసుకుని అన్నం వండి క్యారేజీలు రెడీ చేసి పిల్లల్ని..భర్తని బయటకి పంపే వరకూ కూడా తానూ ఏమి తినలేదు..ఆరోగ్య సంభందిత వ్యాయామాలు చేయలేదు.ఒక వేళ తరువాత చేయాలనీ అనుకున్నా సరే ఓపిక ఉందని పరిస్థితి. అలాంటి స్త్రీలు కొన్ని కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే చాలు మీరు జాగింగ్ కి వెళ్ళినదానికంటే కూడా ఎక్కువ ఫలితాలని పొందవచ్చు అంటున్నారు అమెరికాకి చెందిన న్యూట్రిషన్ నిపుణులు..

 Image result for oats for women health

ఈ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ఒక కప్పు వోట్స్ ని మహిళలు ఒక రోజులో ఎదో ఒక సమయంలో తీసుకుంటే వారు నాలుగు గంటలు జాగింగ్ చేసిన ఫలితం ఉంటుందట..అలా రోజు ఒక కప్పు తీసుకుంటూ సుమారు రెండు నెలలు కనుకా ఈ పద్దతిని పాటిస్తే..బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలలో అనుకోని విధంగా మార్పు కనిపిస్తుందని చెప్తున్నారు నిపుణులు అంతేకాదు స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ కణాలని ఈ వోట్స్ విచ్చేదించడంలో ఉపయోగపడుతాయి అని చెప్తున్నారు..అయితే రెండు నెలలు వీరు చేసే ఈ ప్రక్రియలో పాలు,మాంసం,గుడ్డు వంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు..ఎందుకంటే ఎక్కువ శాతం ఉబకాయానికి..లేదా..గుండె పోట్లు..మధుమేహం కలగడానికి ఈ “పాలు,మాంసం,గుడ్డు” నే కారణం అని వారి పరిశోధనలలో రుజువయ్యింది అంటున్నారు.

 Image result for oats women health

వోట్స్  కనుకా డైలీ ఆహరమలో చేరుచుకుంటే ఎన్నో ఫలితాలు ఉంటాయి..వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి..బరువు తగ్గాలనే వారికి వోట్స్ ఒక ఔషది అని చెప్పాలి..మధుమేహం కంట్రోల్ చేయాలనుకునే వారికి..గుండె జబ్బులని దూరం చేసుకోవాలనే రోగులకి..భావిష్యతులో ఇటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకునే ఎంతో మందికి వోట్స్ చేసే మేలు మరే ఇతర పదార్ధాలు చేయవు..ఓట్స్ లో ఉండే బీటా గ్లోకాన్ శరీరంలో చెడు కొవ్వుని తగ్గిస్తుంది..ఇవి శరీరంలో ఉండే ప్రీరాడికల్స్ తో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా  ఉంచుతుంది. ఇది ముఖ్యంగా పెద్ద పేగు యొక్క పని తీరుని మెరుగు పరుస్తుంది..అంతేకాదు వోట్స్ లో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉండటంతో ఎంజైమ్ వ్యవస్థని మెరుగు పరుస్తుంది....రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ ఉంటుంది.అందుకే ఇప్పుడు మార్కెట్ అంతా వోట్స్ చుట్టూ నడుస్తోంది..మధుమేహం వారికోసం తయారు చేసే బిస్కట్స్ ఎక్కువ భాగం వోట్స్ నుంచే చేస్తారు..వీటిని ఆరోగ్యంగా ఉన్నవారు..జబ్బులతో భాదపడే వాళ్ళు అందరూ తినవచ్చు.

 Image result for oats women health

  

 


మరింత సమాచారం తెలుసుకోండి: