వీటిలో విటమిన్లు, లైకోపిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల రిస్క్ను తగ్గిస్తాయి. టొమోటోలు ముక్కలుకోసుకుని శాండ్విచ్ లతో కలిపి తీసుకోవచ్చు. సలాడ్ లు లేదా సాస్ తయారుచేసుకొని తినవచ్చు. అలాగే గోదుమ పాస్తాతో కలిపి తీసుకోవచ్చు. ఉడికించిన టొమోటొలు సాస్, కేన్ చేసిన సాస్ గానీ, షాపుల్లో లభిస్తాయి. పండిన టమేటోలో కంటే ఇలా తయారు చేసిన సాస్ లలో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపిన్ మూలంగానే టొమోటోలు ఎర్రగా ఉంటాయి. ఉడికించిన లేదా కేన్ చేసిన టొమేటో సాస్ లో ఉక్కవగా లైకోనిన్ ఉంటుందని, ఇవి గుండెజబ్బుల రిస్క్ తక్కువగా ఉండటానికి దోహదం చేస్తయని పలు పరిశోధనలు నిగ్గుతేల్చాయి. రక్త ప్రసరణను నియంత్రించడానికిఉపయోగపడే విటమిన్ సి, ఇ, ప్లేవనాయిడ్స్, పొటాషియం వంటివి వీటిలో పుష్కలంగా లభిస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: