మనం ప్రతిరోజు మన కూరగాయలలో ఉపయోగించే క్యాప్సికమ్ వల్ల చేకూరే ప్రయోజనాలు పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో ఉండే క్యాప్సికమ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తూ ఉండటంతో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు తమ ఆహారంలో క్యాప్సికమ్ ను బాగా వినియోగిస్తున్నారు. 

ఇది కేవలం ఆహారంగానే కాక అనేక రకాల పోషకాలను అందించే ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది అన్న విషయం చాల కొద్దిమందికే తెలిసిన నిజం. మనకు వచ్చే వివిధ అనారోగ్యాల నుండి ఈ క్యాప్సికమ్ మనలను కాపాడుతుంది. క్యాన్సర్, పెప్టిక్ అల్సర్, స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ధీర్ఘ వ్యాధులు రాకుండా చూడడంలో క్యాప్సికమ్ ప్రధానపాత్ర వహిస్తుంది. అంతేకాదు శరీర నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీగా కూడ క్యాప్సికమ్ వాడకం మేలుచేస్తుంది.  

ప్రధానంగా ఆర్థరైటిస్ ఉన్న వారు క్యాప్సికమ్‌ను తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనంఅని చెపుతారు. ఈ క్యాప్సికమ్ లో ఉండే ఆల్కలాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్ల లాగా పనిచేస్తాయి. క్యాప్సికమ్‌ ను మన ఆహారపు అలవాట్లలో చేర్చుకోవడం వల్ల  జీర్ణ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. దీనికితోడు పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పనిచేసే ఔషధాలు క్యాప్సికమ్‌లో ఉన్నాయి. ఇవి ట్యూమర్లను పెరగనీయకుండా చూస్తాయి. ప్రోస్టేట్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌లు ఉన్నవారు క్యాప్సికమ్‌ను తరచూ తీసుకుంటే కొంత ఫలితం ఉంటుందని వైద్యులు చెపుతూ ఉంటారు.  

ముఖ్యంగా ప్రపంచంలో కోట్లాదిమంది బాధ పడుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికమ్‌ను తమ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను సులువుగా తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండటంతో ఎముకల దృఢత్వానికి కూడ బాగా పనికి వస్తుంది.  చివరిగా మన చర్మానికి కాంతినివ్వడంలో దాన్ని సంరక్షించడంలో క్యాప్సికమ్ ఎంతో సహాయ పడుతుంది. ఇన్ని ప్రయోజనాలను ఉన్న క్యాప్సికమ్ తో అనేకరకాలైన వంటలు చేసుకుని తినడం వలన అనేక దీర్ఘ వ్యాధుల నుండి బయటపడే అవకాశం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: