అరటి చెట్టు శుభకార్యాలకు ప్రతీకగా కనిపిస్తుంది. మామిడి తోరణం కనిపించింది అంటే ఆ ఇంటిలో ఎదో ఒక మంచి జరుగుతున్నట్లు లెక్క. అటువంటి చెట్టు అందించే అరటి పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో అరటి పండుకు విశేష ప్రాధాన్యత ఉంది. మానవుడి రక్త కణాలను ఈ పండు అభివృద్ధి చేస్తుంది.

అరటి పండు తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరగడమే కాకుండా ఇప్పుడు చాల మంది బాధ పడుతున్న మల బద్ధకానికి అరటి పండు దివ్య ఔషదం లా పనిచేస్తుంది. అందుకే అరటి పండు చేసే మేలు మరే పండు చేయడు అని అంటారు. ఈ పండులో ‘బి’ విటమిన్ బాగా ఉండటం వల్ల మన శరీరానికి నిరంతర శక్తిని ఉత్సాహాన్ని ఈ అరటి పండు కలిగిస్తుంది.

అంతేకాదు డీ హైడ్రేషన్ అరికట్టే శక్తి ఈ అరటి పండులో చాల ఎక్కువ. చిన్న పిల్లలకు ఈ అరటి పండును క్రమం తప్పకుండా అలవాటు చేస్తే పిల్లల శరీరంలోని ఖనిజ లోపాలు వల్ల ఏర్పడే సమస్యలు రూపు మాసిపోతాయి. ఈ పండులో కొవ్వు పదార్ధాలు తక్కువ పిండి పదార్ధాలు ఎక్కవగా ఉండటంతో మన శరీర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోవడానికి ఈ పండు బాగా పనికి వస్తుంది.

ఇక అరటి కాయలను మన ఆహారంలో తరుచూ తినడం వల్ల ఫైల్స్ కంప్లైంట్ నుండి బయట పడతారు. అంతేకాదు ఈ చెట్టు అరటి పువ్వును కూరగా వండుకోవడం వల్ల రుచితో పాటుగా మన శరీరానికి సంబంధించిన అనేక పోషకాలను ఈ అరటి పువ్వు  కలిగిస్తుంది. మన దక్షిణ భారత దేశంలో అరటి పంట పండని ప్రాంతం ఉండదు కాబట్టి మన దక్షిణాది ప్రాంతం వారందరికీ ఈ అరటి ఆరోగ్య ప్రధాయినిగాగుర్తింపు తెచ్చుకుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: