మనిషి శరీరంలోని సర్వరో గాలను నివారించే శక్తిగల కలబంద గురించి తెలిసిన వారు చాల తక్కువ మంది. సాధా రణంగా ఇంటికి దిష్టి తగల కుండా పెంచుకునే ఈ మొక్కలోని లాభాలను జనం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కలబంద రసం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజన కరమని శాస్త్రవేత్తలు కూడా నిరూ పించారు. దీనిలో ఉన్న విటమిన్లు పలు రోగాలకు ఆద్భుతంగా పని చేస్తాయి. కలబందలో 99.3 శాతం నీరు, ఎబి కాంప్లెక్స్‌ విటమిన్లు, ఎంజైమ్‌లు, మిన రల్స్‌, అండ్రోక్వికోన్లు, అమైనో యాసిడ్లు ఉంటాయి. 

కలబంద మిశ్రమం రాసుకుంటే అనేక దీర్ఘకాలిక రోగాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇపుడు ఏ ఇంట చూసినా కలబంద మొక్క కనువిందు చేస్తుంది.
కలబంద రసం తాగడం వల్ల శరీరంలో అంతర్గత వ్యాధులు తొలగి పోతాయి. ఇందులో బ్యాక్టీరియా, వైరస్‌, వ్యాధు లను నివారించే శక్తి ఉంది. కడుపులో మంట, గుండె జబ్బు, క్యాన్సర్‌, కీడ్నీ సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చెవి, ముక్కు, గొంతు, సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

అంతేకాదు జాండీస్ లాంటి కాలేయ సంబంధమైన వ్యాధులను నయం చేయడంలోను మరియు అల్సర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలోని కలబంద ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. కలబంద జెల్ ను మన శరీరం పై రాసుకోవడం వల్ల మన శరీరం కాంతివంతంగా ఉండటమే కాకుండా మన శరీరానికి కూలింగ్ ఏంజల్ గా కలబంద పనిచేస్తుంది. 

ప్రస్తుతం మనం వాడే అనేక కాస్మటిక్స్ లో కలబందను ఉపయోగిస్తున్నారు. మన కంటి కింద వచ్చే నలుపును అదేవిధంగా ముడతలను కలబంద నివారిస్తుంది. అంతేకాదు మన అందమైన జుత్తు కోసం వాడే రకరకాల హెయిర్ ఆయిల్స్ లో కూడ కలబందను ఉపయోగిస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కలబందను మన ఇంటి ఆవరణ పెద్దగా లేకపోయినా ఒక కుండీలలో పెంచుకోవడం వల్ల మన ఇంటికి దిష్టి తగలకుండా ఉండటమే కాకుండా మనకు మరెన్నో ప్రయోజనాలను అందించే ఆరోగ్యబంధు కలబంద..  


మరింత సమాచారం తెలుసుకోండి: