ప్రేమలో కోపతాపాలు.. అలకలు కొత్తేమీ కాదు. ఎప్పుడో.. ఏదో ఒక సందర్భంలో ప్రేమికుల్లో ఎవరు ఒకరు కోపగించుకోకుండా ఉండరు. అలాంటప్పుడు వారిని ఇలా ఇంప్రెస్ చేసేయండి..

 తనే గొప్ప అనాలి – మీరు ఎంతగానో ప్రేమించే మీ ప్రేయసికి ఎప్పుడు కోపమొస్తుందో తెలుసా? ఎవరి‌తోనో పోల్చి తనని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు. అందుకే సాధ్యమైనంత వరకు తనే గొప్ప అనేలా మాట్లాడేందుకు ప్రయత్నించండి. అంతేకానీ.. నీకంటే ఏ కత్రినా లేదా కరిష్మానో బాగుంటుందని చెప్పారనుకోండి. ఇక అంతే సంగతులు. మీ

చీటి చిరిగిపోయినట్టే…

వాళ్ల ఇష్టం ముఖ్యం– అన్నింటికన్నా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటో తెలుసా? ఏదైనా మాల్‌లో షాపింగ్ చేయడానికో లేదా పార్కులో షికారు చేయడానికో వెళ్తున్నప్పుడు వారి ఇష్టానికే విలువివ్వాలి. అంతేకాదు కాస్త నోరుని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలి సుమా. వాళ్లకు బాగా నచ్చినదాన్ని అస్సలు బాగోలేదని ఎప్పుడూ అనొద్దు. సున్నితంగా చెప్పాలి. ఇది బాగుంది…మరొకటైతే ఇంకా బాగుంటుందేమో అనాలి.

 

బలహీనతలు తెచ్చే తంటా – ప్రతి మనిషికి ఏవో కొన్ని బలహీనతలు ఉండడం మానవ సహజం. అయితే వాటిని ఎవరైనా ఎత్తి చూపిస్తే వారు తట్టుకోలేరు. మీరు కూడా మిమ్మల్ని ప్రేమించేవారి బలహీనతల్ని ఎత్తిచూపించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు. నీకు భయమెక్కువ..నీకు మాట్లాడడం రాదు..ఎందుకు ఎప్పుడూ తొందరపడుతూ ఉంటావు? లాంటి ప్రశ్నలతో వారిని విసిగించారనుకోండి..వారు నొచ్చుకొని మీ బలహీనతల్ని వెదికే పనిలో పడతారు..అవి మాటపట్టింపులకు కూడా దారి తీయవచ్చు. అందుకే కాస్త ఈ విషయంలో జాగ్రత్తపడండి..

 హాబీలను మెచ్చుకోండి– ప్రతి మనిషికి ఏదో ఒక అభిరుచి ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ఏదో ఒక అభిరుచి ఉండనే ఉంటుంది కదా.. వాటికి మీరు వీలైతే ప్రోత్సాహమే ఇవ్వండి తప్పితే..వారిని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడవద్దు. ఉదాహరణకు..మీరు ప్రేమించే వ్యక్తి మంచి ఆర్టిస్టు అనుకోండి..’ఎందుకు ఎప్పుడూ ఏదో ఒక బొమ్మ గీస్తూ ఉంటావు..ఏం పనీపాటా లేదా?’ అని అన్నారనుకోండి..వారి మనసు బాధ పడుతుంది. అలా వారు ఎప్పుడైతే బాధపడతారో మీ మీద వారికి ప్రేమ కూడా తగ్గుతుందన్న విషయంలో సందేహం లేదు కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: