ఇండియా, అమెరికా, లండన్ ... ఏ దేశంలో ఉన్నా ఇప్పుడు ఒక్కటే కల్చర్. అదే కార్పోరేట్ కల్చర్. ఎందుకంటే, ప్రపంచం ఒక చిన్న గ్లోబల్ విలేజ్ గా మారింది. అందుకే, ఏ దేశంలో పని చేస్తున్నా ఒకే ఆఫీసు వాతావరణం కనిపిస్తుంది. అయితే, ఎక్కడ పని చేసినా ముందుగా ఇంప్రెస్ చేయాల్సింది బాస్ నే. అందుకే, బాస్ దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేస్తే ఆఫీసులో సగం పని ఈజీ అవుతుంది. అందుకోసం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. మొదటి రోజు మీరు ఆఫీసులో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరూ మిమ్మల్నే అబ్సర్వ్ చేస్తుంటారు. అంతేకాదు, ఆ రోజు మీరు బాస్ తో వ్యవహరించే తీరు మీ కెరియర్ ను డిసైడ్ చేస్తుంది. అందుకే, ఫస్ట్ టైమ్ ఆఫీసుకు వెళ్లేటపుడు కాస్త జాగ్రత్తలు తప్పనిసరి. మీ డ్రస్స్ దగ్గర నుంచి మీరు వేసుకున్న షూస్ వరకూ చెక్ చేసుకోవాలి. కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగానికి వెళుతుంటే, కచ్చితంగా డ్రస్ కోడ్ పాటించాలి. మీ ముఖాకృతికి సరపోయే హెయిర్ స్టయిల్ ను ఫాలో కావాలి. బాస్ ను, ఇతర స్టాఫ్ నూ చిరునవ్వుతో పలకరించాలి. అంతేకాదు, ఆఫీసులో అడుగు పెట్టిన మరుక్షణం మీరు గుర్తుంచుకోవాల్సింది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీకు అస్సలు నచ్చని అసైన్ మెంట్ ఇచ్చినా, బాస్ చేసిన పని నచ్చక పోయినా పొరపాటున కూడా ఆ విషయం ఎవరి తోనూ అనకూడదు. ఆఫీస్ అవర్స్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్, ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడకూడదు. కొలీగ్స్ తో కలిసి ఎక్కువ సార్లు క్యాంటిన్ కు చెక్కేయకూడదు. ఏదైనా అర్జంట్ వర్క్ మీకు చెబుదామని బాస్ మీ సీటు దగ్గరకు వచ్చినప్పుడు మీరు లేకపోతే ఇంప్రెషన్ మారొచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు.  మీరు మంచి మార్కులు సంపాదించవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: