లండన్ లోని ఒక హోటలు స్థానిక ఓవల్ కేఫ్ గేమ్స్ ఆఫ్ త్రోన్స్ పేరిట అన్ని ప్రత్యేక వసతులతో ప్రారంభానికి రెడీ అయింది. అయితే ఈ హోటల్ కి ప్రచారం కల్పించడం కోసం అన్నట్టు ఇప్పుడు ఈ హోటల్ లో కొత్త రూల్ పెట్టారు. ఇక్కడ అంతా నగ్నంగా నడవాలి. ఎస్ వెయిటర్ దగ్గర నుంచీ వడ్డించే వారూ, క్లీన్ చేసేవారూ , కస్టమర్ లూ, కౌంటర్ లో డబ్బు తీసుకునేవాడితో సహా అందరూ బట్టలు లేకుండా ఈ రెస్టారెంట్ లో కనపడ్డారు. నేకిడ్ రెస్టారెంట్ గా పేరొచ్చిన ఇక్కడ భోజనం చెయ్యడం కోసం నాలుగు వేల మంది ఓకే చెప్పేశారు ఇప్పటికే.



ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లు లోపలికి తీసుకుని రాకూడదు.ఎవరైనా తొంగి చూసే అవకాశం లేకపోవడం తో ధైర్యంగా అందరూ ఉండచ్చు. ఇంతకీ విడిచిన దుస్తులు - ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకోవడం ఎలా అనుకుంటున్నారా?  వాటిని భద్రంగా దాచుకునేందు ప్రత్యేక లాకర్ల వసతిని హోటలే స్వయంగా కల్పిస్తోంది. పాత కాలం లో ఆది మానవుడు ఎలా బతికే వాడో ఆ రకంగా కట్టెల పొయ్యి మీద వండటం , మట్టి పాత్రలలో వడ్డించడం కూడా చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: