మీ బరువును మోసే వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. మీ కుటుంబ భారాన్ని మోసే మీకు ఇన్సూరెన్స్ వుందా....? ఇన్సూరెన్స్ భారం కాదు.  మీ మీద ఆధారపడ్డ కుటుంబానికి మీరు నిర్వర్తించాాల్సిన బాధ్యత. మీ వాహనానికి ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ వుందా అని అడుగుతారు.

మీ ఆత్మీయులు కి ఏమైనా ఆక్సిడెంట్ జరిగినా, అనారోగ్యం వచ్చినా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని మీరు ఆఖరికి వైద్యం చేసే హాస్పిటల్ లో డాక్టర్ గారు కూడా 
అడుగుతున్నారు. మీ ఆత్మీయులు చనిపోతే ఆఖరికి మీరు కూడా అతనికి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. కానీ, అతను బాగున్నప్పుడు నీ కుటుంబ భవిష్యత్ కోసం నీకు ఇన్సూరెన్స్ వుందా, సరిపడా వుందా అని ఎందుకు సలహా ఇవ్వడం లేదు. 

ఆలోచించండి. ఆత్మీయులు చనిపోతే వారి కుటుంబానికి ఆధారం ఇన్సూరెన్స్ ఆదుకుంటుందని ముందు గా తెలియ చెప్పండి. చాలా మందికి డబ్బు ఉంటుంది. కానీ అది ఆస్తుల రూపంలో ఉంటే కుటుంబ యజమాని చనిపోతే ఆ ఆస్తులని అమ్ముకుని బ్రతకమని  చెప్పలేము కదా. 

ప్రతి కుటుంబానికి సరిఅడినంత జీవిత భీమా మరియు ఆరోగ్య భీమా ఈ రోజుల లో చాలా అవసరం అని ఒక చదువుకున్న వ్యక్తిగా, సమాజానికి మీవంతు 
సలహా ఇవ్వండి. ఏదైనా జరిగాక అంతా సానుభూతి చూపిస్తారు. అయ్యో అని బాధపడతారు. కానీ ఆ అవసరం రాకుండా ముందే హెచ్చరించడం మంచిది కదా.. ఆలోచించిండి.



మరింత సమాచారం తెలుసుకోండి: