ఐ.టి. కంపెనీ ఉద్యోగైన రాజేష్ ఆరోగ్యం బాలేదని పేరుగాంచిన అన్ని ప్రముఖ ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు! అయినా ఆరోగ్యం కుదుట పడక చాల బాధ పడుతున్నాడు! అతని భార్య ఓ సలహా యిస్తూ "ఎందుకైనా మంచిది మీరొకసారి పశువుల డాక్టర్ని సంప్రదించండి" అన్నది! రాజేష్ షాకై "నీకేమైనా పిచ్చా నేను పశువుల డాక్టర్ని కలవడమేంటి?" అని అరిచాడు! 

భార్య సున్నితంగా "నాకేం పిచ్చికాదు మీకే ప్రాబ్లమ్! 
తెల్లవారకముందే కోడిలాగా లేచిపోవటం..
కాకిలాగా సగం స్నానం చేయడం..

కోతిలాగా చేతికి దొరికిందేదో నోట్లో పెట్టుకుతినడం..
గుర్రంలా ఆఫీస్ కి పరగులుతీయడం.. 
అక్కడ ఆఫీసులో గాడిదలా  చాకిరీ చేయడం.. 

ఎలుగుబంటిలా అందరిపై రంకెలేయడం.. 
రాత్రికి ఇంటికి వచ్చి ఆ చికాకుతో కుక్కలా మాపై అరవడం.. 
మొసలిలా ఆబగా తినేయడం.. 
మంచమెక్కి గేదెలా నిద్రపోవడం.. 

ఇవే కదా మీరు రోజూ చేస్తున్న పనులు.. 
అందుకే ఓసారి పశువుల డాక్టర్ని కన్సల్ట్ చేయండి.. ప్లీజ్ అన్నది. 

భార్య మాటలకు షాక్ అయిన రాజేష్ నిశ్చేష్టుడై 
భార్యనే చూస్తూ కూర్చుండిపోయాడు! 
" ఏమిటీ గుంటనక్కలా నన్నే చూస్తున్నావ్?" అడిగింది రాజేశ్ భార్య.. 

ఇది కేవలం జోక్ మాత్రమే కాదు.. కాస్త ఎగ్జాగరేషన్ ఉన్నా.. వాస్తవం.. సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు.. అనేక ఉద్యోగాల్లో.. మన ఉరుకుల పరుగుల జీవితాల్లో జరుగుతున్నది ఇదే. ఒక్కసారి మిమ్మల్ని మీరు సరి చూసుకోండి. రాజేశ్ లా మీరు కాకపోతే.. సంతోషం. అతనిలా అనిపిస్తే మాత్రం కాస్త మారండి. మీ కోసం.. మీ కుటుంబం కోసం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: