భగభగ మండుతున్న భానుడు అగ్ని వర్షం కురుస్తుందా? అన్నట్లుంది భూగోళం. నిన్నటి రోజున తెలంగాణా పారిశ్రామిక ప్రాంతం ఇల్లందు లో గతమూడు రోజులుగా అత్యధిక ఉష్ణ తాపం 50 డిగ్రీల నమోదవుతుంది. రామగుండం, భద్రాచలం, నల్గొండ, హనంకొండ, ఖమ్మం నగరాలు నిప్పుల కొలిమిలో మాడిపోతున్నాయి. ఆకాశం అప్పుడప్పుడూ మెఘాలతో నిండినా, భానుడు తన ప్రతాపాన్ని తగ్గించుకోవటం లేదు. నాలుగైదు రోజుల్లోజల్లులు పడే అవకాశం ఉన్నా మంటలు మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. గురువారం రోజు హనమకొండలో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రెకార్డైంది.


కరవు కరాళ నృత్యం

Image result for draught

 

రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు, ఎండ తీవ్రతవల్ల వచ్చే రేడియేషన్ వేడిమి భరించలేక నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 65 చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లలోనే 11 మంది మరణించారు. వరంగల్ జిల్లా కేసముద్రంలో రెండు టన్నుల చేపలు మాడిమసైపోయాయి. ఇదంతా కుంటల్లో చెరువుల్లో నీరు ఎండతీవ్రతకు అడుగంటి పోవటం వలన జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు కొట్టివేయటం, చెరువులు నదీతీర ప్రాంతాలు భూకబ్జాకు గురవటం, అడవుల నరికివేతవంటి మానవ ప్రేరెపిత ప్రకృతి భీబత్సమే కారణం. సూర్యుని వేడిమిని అడ్డుకునే ఓజొన్ పొర క్రమంగా కరిగిపోవటం, ఎల్-నినో ప్రభావం ప్రకృతి భీభత్సానికి దారితీస్తున్నాయి. ఉత్తర తెలంగాణాలోని శ్రీరాంసాగర్ ప్రోజెక్ట్ నీరులేక భీడు భూమిలా మారింది. నీరులేక        ప్రోజెక్ట్ ఆనవాళ్ళు కనిపించని పరిస్థితి. మంజీరా నదిలో ఇసుక మేటలు వేసి ఎడారిలా కనిపిస్తుంది. కరువు తీవ్తతకు ఖరీఫ్, రబీలకు రైతులు దూరమై నిరాశా, నిస్ప్రుహలతో కొట్టిమిట్టాడుతున్నారు. నీరులేని ఎత్తిపోతల పధకాలు నిస్పృహతో చూస్తున్నాయి. ధారుణంగా పడిపోయిన భూగర్భజలాలు ధరణిని నిప్పుల కుంపటిలా మార్చేస్తున్నాయి.


నీరూ లేదు నీడా లేదు...చావే శరణ్యమా!


 

ప్రభుత్వాలు ఇప్పటికైనా మానవ ప్రేరేపిత ప్రకృతిహననాన్ని ఉక్కుపాడం మోపైనా నివారించాలి. సభలు, సమావేశాలు, స్వకుచమర్ధనాలు కొంతకాలమైనా ఆపి నాయకత్వాలు కరవు నివారణపై శ్రద్ద పెడితే కొంతైనా ప్రజలకు మేలు జరగొచ్చు. లేకుంటే సాంఘిక సమతుల్య స్థితి దారితప్పే ప్రమాదముంది.


 

ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్ల కోస్గి మండలం, బోల్వాని పల్లే గ్రామంలో రెండుసంవత్సరాల క్రితం నిస్చితార్దమైన వివాహాలు ఇప్పటికి జరగటం లేదు. కారణం నీరు, ఎండ, కరవు పేదరికం దుస్థితులకు కారణం. తీవ్ర దుర్భిక్షంతో తెలంగాణా పల్లెలు అల్లల్లాడుతున్నాయి. బ్రతుకు దారితెలియని రైతులు ఉన్నవూరిని వదలి వలసదారులు పడుతున్న వైనం ప్రభుత్వం గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: