ఉల్లిపాయ వాడని ఇల్లంటూ ఉండదు ప్రతి ఇంట్లోనూ వివిధ రకాల వంటకాలలో విరివిగా వాడుతారు. భారతీయ వంటలలో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా ఉపయోగిస్తారు. ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉల్లిపాయలు వివిధ రంగుల్లో రెడ్, ఎల్లో, వైట్ మరియు గ్రీన్ కలర్స్ లో ఉంటూ ఉంటాయి. 

ఉల్లికి ప్రత్యేకమైన  రుచి మరియు వాసన కలిగి ఉంటుంది. కొన్ని ఉల్లిపాయలు తీపిని కలిగి ఉంటాయి. ఉల్లిపాయలను చాలా రకాల సలాడ్స్, రైతా వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంతే కాదు వీటిని ఉడికించి, ఫ్రై చేసి మరియు రోస్ట్ చేసి వివిధ రకాలుగా వంటలలో ఉపయోగిస్తారు. ఉల్లిపాయలో అత్యధిక ఔషధ విలువలు కలిగి ఉండటంతో ఆయుర్వేదంలో దీనిని మూలికగ పిలుస్తారు. ప్రాచీన కాలం నుండీ కొన్ని ఔషదాలలో ఉల్లిపాయను ఉపయోగిస్తున్నారు. 

స్వీట్ ఆనియన్స్ కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇవి కొన్ని రకాలైన జబ్బులను నివారిస్తాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు, నివారించేందుకు, క్యాన్సర్, ఇతర ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి ఉల్లి బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో అధికంగా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. మనం ఉపయోగించే ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది అంటే ఎవరూ నమ్మలేని నిజం. ఉల్లిపాయ రసం, ఆవనూనె సమంగా కలిపి వేడి చేసి మర్దన చేస్తే అన్ని రకాలైన నొప్పులు తగ్గుతాయి అని చెపుతూ ఉంటారు. 

మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజూ ఉదయంపూట తింటే రాళ్లు కరిగిపోతాయి అని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే అతి తక్కువ ధరలో దొరికే ఉలిగడ్డలను వైద్య, ఆరోగ్య సంస్థలు ట్యాబ్లెట్స్ తయారీలో వాడుతున్నాయి. బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉల్లి కాపాడుతుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడ చేయదు అని అంటారు..



మరింత సమాచారం తెలుసుకోండి: