జీవితమంటేనే కష్టసుఖాలు.. వీటికి తోడు అప్పడప్పుడూ ఆటవిడుపు ఉండకపోతే అది జీవితం అనిపించుకోదు. అందుకే అప్పుడప్పుడూ టూర్లు వేస్తుండాలి. ఈ భూమి మీద ఉన్న ఎన్నో అందాలు తమను చూడమని ఆస్వాదించమని మనల్ని కోరుతున్నాయి. కాకపోతే అవన్నీ మనకు అందుబాటులో ఉండవు. కానీ అందుబాటులో ఉన్నవాటిని మనం మిస్ చేసుకోకూడదు.. 

ఆహ్లాదం కలిగించే గురెజ్ లోయ అందాలు.. 


అలాంటి వాటిలో ముందుంటుంది కాశ్మీర్ లోయ. కాశ్మీర్ అంటేనే భూలోక స్వర్గమంటారు. అందులోనూ మరింత సుందరమైంది గురెజ్ లోయ. ఇప్పుడు ఆ లోయ వివరాలు తెలుసుకుందామా.. ఈ గురెజ్ లోయ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు దగ్గరకు ఉంటుంది. అందుకే అటు వెళ్లేందుకు పెద్దగా సాహసం చేయరు మరి.  కానీ ఇటీవల మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో సీన్ మారింది. 

చిన్న చిన్న ఇళ్లలో దార్ద్ తెగ ప్రజలు.. 


ఈ గురెజ్ లోయకు కూడా పర్యాటకులు పెరుగుతున్నారు. శ్రీనగర్ కు ఇది 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లోయలోకి పాకిస్థాన్ నుంచి గంగానది ప్రవహిస్తుంటుంది. గంగానది.. ఆ నది పిల్లకాలువలు, ఉపనదులు.. చుట్టూ ఉన్న కొండలు.. దట్టమైన మేఘాలు.. మనల్ని చూపుతిప్పుకోనివ్వవు.. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలోని గురెజ్ లోయ..


ఈ లోయలో చిన్న ఇళ్లలో దార్ద్ తెగ ప్రజలు మాత్రమే నివాసం ఉంటారు. వీరికి చరిత్ర కూడా ఉంది. వీరంతా తాము గతంలో ఇండియాపైకి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్ వారసులమని చెప్పుకుంటారు. కమ్యూనికేషన్ సౌకర్యాలు అంతగా లేని ఈ లోయ ప్రకృతి రమణీయతతో మనల్ని కట్టిపడేస్తుంది. వీలు చూసుకుని ఓసారి ఫ్యామిలీతో వెళ్లి రండి.



మరింత సమాచారం తెలుసుకోండి: