అల్లం అనేక రకాలుగా వంటకాలలో వాడుతూ ఉంటారు. ఒక చిన్న మొక్క వేరునుండి వచ్చే దీనివల్ల వచ్చే ప్రయోజనాలు అనేకం. ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు.  మనం రోజు తినే పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. 

అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర కీలకం. రక్త నాళాల్లో రక్తప్రవాహన్ని ఇది  మెరుగుపరుస్తుంది అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా మెరుగు పడుతుంది అని ఆయుర్వేద వైద్యులు చెపుతూ ఉంటారు. 

అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. రక్త శుద్దికి తోడ్పడుతుంది రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది. అల్లం కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెచ్చి పెడుతుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేఅయగలిగిన శక్తివంతమైన ఔషధము అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడి అయింది. 

ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోదకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న అల్లంను మనం ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత మంచిది..



మరింత సమాచారం తెలుసుకోండి: