వేసవి కాలంలో మనం అనేక రకరకాల మిల్క్ షేక్స్  తాగుతూ ఉంటాం. అయితే వాటి అన్నింటిలోకి మన శరీరానికి సరిపడా న్యూట్రీషియన్స్ అందివ్వడంలో  బొప్పాయి మిల్క్ షేక్ కు మించింది లేదు అని అంటారు పోషకాహార నిపుణులు. ఒక గ్లాస్ బొప్పాయి మిల్క్ తాగడం వల్ల మన శరీరానికి అవసరం మరియు సరిపోయే విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా అందుతాయి. 

విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు ఇందులో పుష్కలంగా ఉండటంతో తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి అని డైటీషియన్స్ చెపుతున్నారు. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన  మన జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కూడ బొప్పాయి ఎంతగానో సహకరిస్తుంది విటమిన్‌లు, తో పాటు  ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలంగా లభిస్తుంది. 

బొప్పాయి మరియు పాలు రెండింటి కాబినేషన్ లో తయారుచేసే, ఈ బొప్పాయి మిల్క్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బోన్స్ మరియు టీత్ ను స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంచుతుంది. మలబద్దకంతో బాధపడే వారికి పపాయ మిల్క్ బాగా సహాయపడుతుంది.  అంతేకాదు మన  జుట్టు పెరుగుటకు కూడ ఈ బొప్పాయి మిల్క్ షేక్ బాగా సహకరిస్తుంది. బొప్పాయి మిల్క్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. 

అంతే కాదు చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహకరిస్తుంది ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉండుట వల్ల ఇది మన మజిల్ హెల్త్ కు మరియు మజిల్ రిపేర్ కు సహాయపడుతుంది.బొప్పాయ మిల్క్ శరీరానికి అవసరమ్యే స్ట్రెంగ్త్ ను మాత్రమే అందివ్వడం కాదు, మజిల్ టిష్యులను రీగ్రోత్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉండుట వల్ల ఇది మజిల్ హెల్త్ మరియు మజిల్ రిపేర్ కు సహాయపడుతుంది. క్యాన్సర్ తో బాధపడే వారిలో, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ తో బాధపడేవారు బొప్పాయ మిల్క్ ను తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది  ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ బొప్పాయి జ్యూస్ ను ఎంత తీసుకుంటే అంత మంచిది..



మరింత సమాచారం తెలుసుకోండి: