వాడుక భాషలో ములక్కాడగా పిలువబడే డ్రంస్టిక్స్ వల్ల మన శరీరానికి లభించే విస్త్రుత ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వీటిలో విలువైన మినరల్ మరియు ప్రోటీన్ లు అధికంగా ఉన్నాయి. సాధారణంగా వీటిని సాంబార్, ఇతర కూరగాయలతో కలిపి వాడుతూ ఉంటారు. అయితే వీటిని ప్రత్యేకంగా తినకపోయినా వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ ములగకాడలను ఎవరూ తినకుండా ఉండలేరు. 

వీటిలో కాల్షియం ఐరన్, మరియు ఇతర కీలక విటమిన్ లను కలిగి ఉన్నందు వలన ఎములకు బలం చేకూరుతుంది.. ఈ ములక్కాడలు రక్తాన్ని శుభ్రపరచడంలో సహకరిస్తాయి. అంతేకాదు  బలమైన యాంటీ బయాటిక్ గుణాలను కలిగి ఉండటంతో వీటిని రోజు మన ఆహారంలో ఉపయోగించడం వల్ల మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యల వల్ల మనకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఈ ములగకాడలు ఉపకరిస్తాయి. 

ములక్కాడ ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, మధుమేహ వ్యాధిని తగ్గిస్తాయి. ములక్కాడలను తినటం వలన సూప్ లేదా జ్యూస్ లో కలుపుకొని, తాగటం వలన మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. వీటిలో విటమిన్ 'B' ఎక్కువగా ఉండటంతో పాటు మన శరీర  జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో  కీలక పాత్ర పోషిస్తుంది.

వీటిలో కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్ మరియు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మన శరీరానికి సంబంధించి అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా ఈ మలక్కాడలోని పోషక పదార్ధాలు మనకు మేలు చేస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న వీటితో రకరకాల కూరలను తయారు చేసే విధానం కూడ ప్రముఖ స్టార్ హోటల్స్ లో కూడ మనకు తరుచు కనిపిస్తూ ఉంటాయి. అన్ని కాలాలో అన్ని చోట్ల లభించే ఈ ములక్కాడలు వీలైనంత వరకు తరుచు ఆహారంతో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డైటీషియన్స్ కూడ చెపుతున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: