భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన బహుమతి ఆహారం. మనం రకరకాల రుచుల కోసం రకరకాల పదార్ధాలను తయారుచేసుకుని తింటాం. అయితే శుభ్రమైన పదార్ధాలతో శుచిగా వండిన ఒంట మన మనస్సుని బాగా ప్రభావితం చేయడమే కాకుండా మన జ్ఞాపకశక్తిని పెంచి తద్వారా మనలో వివేక శక్తిని పెంపొందిస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. 

వంట చేసేవారు హృదయ పూర్వకంగా వండినప్పుడు మాత్రమే మనం తీసుకునే ఆహారంలోని గుణాలు మనకు వొంటపడతాయని ఆయుర్వేద వైద్యులు చెపుతూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక గురువులు అయితే దేవుడుకి నివేదన చేసిన ఆహారమే అత్యుత్తమ ఆహారామని ఆ ఆహారం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని అంటారు. 

సాత్విక ఆహారం వల్ల మనిషి దేవుడుకు దగ్గర అవుతాడని భగవాన్ శ్రీకృష్ణ గీతలో సూచించాడు. సాత్విక ఆహారం దేహ సంస్కారాలను నిలబెడుతుందని మనిషిని ప్రకృతికి దగ్గరగా తీసుకు వెడుతుందని మన పూర్వీకులు చెపుతారు. అదేవిధంగా అతిగా భుజించే వారిలో మృదు స్వభావం ఉండదని కేవలం మితంగా భుజించే వారిలో మాత్రమే మృదు స్వభావాన్ని పెంచడమే కాకుండా వారిలో తెలివి తేటలను బాగా పెంచుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు.

ఇక వండిన పదార్ధాలను ఫ్రిజ్ లో నిలవచేసి తిరిగి మరునాడు వేడి చేసుకుని తినే అలవాట్లు ఉన్న వారిలో తమో గుణం పెరగడమే కాకుండా వారిలో హింసా నీచ ప్రవృత్తి వంటి లక్షణాలు బాగా పెరుగుతాయని ఆయుర్వేద వైద్యుల పరిశోదన తెలియ చేస్తోంది. మంచి వాతావరణంలో వండిన పదార్ధాలను మూడు గంటల లోపు భోజనం చేయడం ద్వారా జీర్ణ శక్తి మెరుగు పడటమే కాకుండా మన శరీర నిర్మాణానికి మన మేధస్సు పెంచడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది అని అంటారు. మరి మారిపోయిన నేటి కాలంలో మనం తినే ఆహారం మనకు ఎంత వరకు మేలు చేస్తోంది అనే విషయాన్ని ఒకసారి మనకు మనమే ఆలోచించడం మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: