గుడ్డును మాసాంహరం అంటారు కానీ చాలా మంది శాకాహారంగానే భావిస్తున్నారు. కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు ప్రొటీన్లను అందజేస్తుంది. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం.  

శరీరానికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్ శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు గుడ్డులో లభిస్తాయి. ముఖ్యంగా 9 డిఫరెంట్ టైప్స్ అమినో ఆసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడానికి బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించు కోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు. 

కంటి ఆరోగ్యానికి కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసోనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి. తరుచూ గుడ్డును ఆహారంలో తీసుకోవడం వలన ఒత్తిడి నుండి కాపాడటమే కాక జ్ఞాపకశక్తిని, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఈ గుడ్డులో ఉండే లూమీప్లేమిన్‌, లూమీక్రోమిన్‌ అనే యాంటి యాక్సిడెంట్లు ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు.

ముఖ్యంగా గుడ్డు సొనను మనం వాడటం వల్ల అందులో ఉండే సల్ఫర్ మన చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా శిరోజాల ఆరోగ్యం మెరు గవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలతో కూడుకున్న కోడి గుడ్డు మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి ఎంతో అవసరం.



మరింత సమాచారం తెలుసుకోండి: