మనిషికి నిద్రకు మించిన సుఖం లేదు అని అంటారు. అన్ని సమస్యలు మరిచిపోయి కనీసం రోజుకి 7 – 8 గంటలు హాయిగా నిద్రపోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని అనేక అధ్యాయనాలు చెపుతున్నాయి. అయితే సామాన్యంగా ప్రతి వ్యక్తికి ఎదో ఒక సందర్భంలో మధ్యాహ్నం కునికిపాట్లు రావడం సర్వసాధారణం. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అలవాటు మనిషికి ఏ మాత్రం మంచిది కాదని అధ్యయనాలు చెపుతున్నాయి. దీనికి కారణం ఈ మధ్యాహ్నం నిద్ర అలవాటు వల్ల మన శరీరానికి సంబంధించి మనకు తెలియకుండానే కొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. 

ప్రతిరోజు 8 గంటలు చప్పున నిద్రపోవాలి అన్న విషయం నిజమే అయినా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. ఖచ్చితంగా రాత్రిపూటే  సరిపడా నిద్రపొవాలి అని వైద్యులు చెపుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఫాలో అయితే ఒక మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్ లా పనిచేసి అనేక వ్యాధులకు దూరంగా ఉండేలా పని చేస్తుంది ఈ నిద్ర. అయితే కొంతమందికి పగటిపూట నిద్రపోయే అలవాటు మాత్రం కొత్త వ్యాధులను తెచ్చిపెడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

మన పూర్వీకులు చెప్పే ధర్మ శాస్త్రం ప్రకారంకూడ మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. దివస్వాపం చా వజ్రయేత్ అని శాస్త్రాల్లో వివరించారు. అంటే మధ్యాహ్నం పడుకోవడం సరైన అలవాటు కాదని అర్థం. అయితే పగటి పూట ఎక్కువ నిద్రపోయేవాళ్లకు, పగలు నిద్రపోని వాళ్లతో పోల్చితే త్వరగా జలుబు వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఎక్కువగా జలుబు చేయడం మొదలైంది అంటే నెమ్మదిగా శ్వాసకు సంబంధించిన సమస్యలుగా మారుతాయని పరిశోధనలు చెపుతున్నాయి.

 అలాగే ఈ మధ్యాహ్నం నిద్ర అలవాటు వల్ల ఊపిరితిత్తులు నాశనం అవడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. శరీరానికి సరైన నిద్ర విశ్రాంతి అందించడంతో పాటు రోజంతా హుషార్ గా ఉంటుంది. అయితే మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు వల్ల మనం మనకు తెలియకుండానే శరీరాన్ని లేజీగా మార్చి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి మనకు మనమే కారణo అవుతున్నాం..


మరింత సమాచారం తెలుసుకోండి: