అవును మీరు వింటుంది నిజమే..ఎక్కువగా సెల్ఫీ ఫోటోలు దిగే వారికి భవిష్యత్ లో త్వరగా ముసలితనం వస్తుందిని పరిశోదకులు వెల్లడిస్తున్నారు.  స్మార్ట్ ఫోన్లతో ఎక్కవగా ముఖానికి దగ్గరగా పెట్టుకొని సెల్పీలు తీసుకుంటే  ముఖంపై ముడతలు పడతాయని చర్మవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం తొందరగా వృద్ధాప్య ఛాయలను పొందుతుందని అంటున్నారు.

ఇక పోతే సహజ సిద్దంగా చర్మంపై ఏదైనా మచ్చలు, ఇబ్బందులు తలెత్తితే బాగుచేసుకునే సహజగుణం ఉంటుందేమో కానీ రేడియేషన్ వల్ల కలిగే చర్మవ్యాధులకు ఆ సదుపాయం ఉండదని హెచ్చరిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లలో సెల్ఫీ దిగే ముందు స్క్రీన్ నుంచి వచ్చే నీలం రంగు కాంతి కూడా చర్మానికి హాని కలిగించగలదని చెప్పారు. ఇవి డిఎన్ఏపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.

అందువల్లే చర్మం త్వరగా పాడైపోతుందని అంటున్నారు...చర్మం కాంతి నుంచి రక్షణ పొందే అవకాశం లేకుండా పోతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఈ మద్య సెల్పీలు పెద్ద ఫ్యాషన్ గా పరిగణిస్తున్నారు జనాలు అయితే వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలు తెలియకపోవడం కొంత కారణం అవుతుందని పరిశోదకులు చెబుతున్నారు. అయితే దీని గురించి తెలిసిన వారు తెలియని వారికి తెలిసే విధంగా చెబితే బాగుంటుందని అంటున్నారు. ఇక సెల్ఫీలకు దూరంగా ఉండి చర్మాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: