మన పెద్దవాళ్ళు ఆచరించిన పద్ధతుల వెనక ఎన్నో  ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.  అయితే ఇప్పుడు ఆ విషయాలను పట్టించుకునే తీరికా ఓపికా నేటి తరం వారికి లేవు. అయితే మన పూర్వీకులు ఎంతో విలువగా చూసిన తులసీ ఆకుల గురించి పసుపు గురించి అదేవిధంగా చద్దన్నం గురించి అమెరికాలో పరిశోధనలు చేసి వాటి ప్రయోజనాలు తెలిపితే కాని వాటి యొక్క విలువ మనకు అర్ధం కావడం లేదు.

అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు ఈమధ్య  మ‌జ్జిగ క‌లిపిన చ‌ద్ద‌న్నం పై అనేక పరిశోధనలు చేసి అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టారు.   రాత్రి మిగిలిన అన్నంలో మ‌జ్జిగ‌, ఉప్పు క‌లిపి కుండలో పెడితే ఉద‌యం అయ్యే స‌రికి ఆ అన్నం పులిసి మంచి పోష‌కాల‌తో రెడీ అవుతుంది దానినే మన పెద్దలు చద్దన్నం అని పిలిచేవారు.  

దీన్ని ప‌చ్చ‌డితోనో ఉల్లిపాయ‌ మిర‌ప‌కాయ‌ల‌తోనో మ‌న‌వాళ్లు ఉద‌యాన్నేగతంలో తినేవారు. దీనితో వారు రోజంతా ఎంతో ఉత్తేజంగా శ‌క్తితో ఉండేవారు.  అయితే ఈ విషయాలను నేటితరం గుర్తించడం కానీ ఆచరించడం కానీ చేయలేని పరిస్థుతులు ఏర్పడటంతో ప్రస్తుత తరం వారు ఈ చద్దన్నంలో ఉండే పోషక విలువలు తెలిస్తే షాక్ అవుతారు.

అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు చేసిన ప‌రిశోధ‌నలలో వెల్లడైన విషయాల ప్రకారం  సాధార‌ణ అన్నం క‌న్నా చ‌ద్ద‌న్నంలో ఐర‌న్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు దాదాపుగా 20 రెట్లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  

చ‌ద్ద‌న్నం, మ‌జ్జిగ కాంబినేష‌న్‌లో ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల రోజంతా శ‌రీరం ఉత్తేజంగా ఉంటుంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అదేవిధంగా  శ‌రీరానికి మంచి చేసే బాక్టీరియా వృద్ధి చెందుతుంది.  వేడి చేసిన వారు ఉద‌యాన్నే ఈ ఆహారం తిన‌డం వ‌ల్ల ఎంతో చ‌లువ పొందుతారు. 

అంతేకాదు మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది. రోజంతా శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి అందుతుంది అని ఈ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ చద్దన్నం విలువను పట్టణ ప్రాంతాలలో గుర్తించకపోయినా ఇంకా చాల పల్లె ప్రాంతాలలోని వారు ఈ చద్దన్నం తినే అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారు అన్నది వాస్తవం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: