సుగంధ ద్రవ్యాలలో ఒకటి అయిన లవంగాలలో యుజెనాల్ అనే రసాయనానికి ఉండే అద్భుత ఔషధ, పోషక గుణాలు ఉన్నాయి. యుజెనాల్ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.  పంటి నొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగాన్ని  బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది అని అంటారు.   అంతేకాదు ఒక లవంగ మొగ్గను బుగ్గన పెట్టుకోవడం ద్వారా నోటి దుర్వాసనను పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.  మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే ‘మద్యం’ తాగాలన్న కోరిక కలగదు అని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి.  

లవంగాలను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటి అనారోగ్యాలకు కూడ ఈ లంగాలు వలన అరికట్టబదతాయి. లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది అని అంటారు.  పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మ జీవుల్నీ లవంగంలోని యుజెనాల్ నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందుగా ఆయుర్వేదవైద్యులు ఉపయోగిస్తున్నారు.  

రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.  జలుబుతో బాధ పడేవాళ్లు కర్ఛీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే వెంటనే తగ్గిపోతుంది.  లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవటడంతో బాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్థ్రైటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట.

లవంగాలు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.  అంతేకాకుండా  లవంగాల నూనె వలన కూడ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.   యాంటీ సెప్టిక్‌ లక్షణాలు, యాంటీ మైక్రోబియాల్‌ గుణాలను కలిగి ఉన్న లవంగాల నూనె, మొటిమలు కలగటానికి కారణమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.  లవంగాల నూనె, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉండటంతో  చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.  

లవంగాల నూనె పొడి జుట్టు, జుట్టు రంగు మారటం, వెంట్రుకలు మధ్యలో తెగటం వంటి జుట్టు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు మొదళ్లకు కావాల్సిన పోషకాలను అందించి, వెంట్రుకలకు ఒత్తయిన కండిషనర్‌లా పనిచేస్తుంది.  ఈ నూనె జుట్టు రాలటాన్ని నివారించి, వెంట్రుకల పెరుగుదలను పెంచే సామర్థ్యాన్ని కలిగించటం వలన బట్టతలను నివారించవచ్చు.

కొబ్బరినూనె, లవంగాల నూనె కలిపిన మిశ్రమాన్ని తలకు రాసి, మసాజ్‌ చేయాలి. రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయటం వలన మంచి ఫలితాలుంటాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న లవంగాల వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలను ఆయుర్వేద వైద్యులే కాకుండా సాధారణ ప్రజానీకం కూడ ఇలాంటి చిట్కాలను బాగా గుర్తిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: