నేను అలసిపోను 
ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాను!
నేను విసిగిపోను 
ఎప్పుడూ ఓపికతో ఉంటాను !
నేను కోపపడను 
ఎప్పుడూ సహనంతో ఉంటాను !
నేను కూర్చోను 
ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాను !
నేను అసూయ పడను 
అంతకంటే బాగా చేస్తాను !
నేను ఆశించను 
ఎప్పుడూ సాధించాలనుకుంటాను !
నేను భయపడను 
ఎప్పుడూ ధైర్యంగా ఉంటాను !
నేను అజ్ఞానిని కాను 
ఎప్పడూ జ్ఞానము వైపు ఉంటాను !
నేను సాంప్రదాయ వాదిని కాను 
ఎప్పుడూ మార్పు వైపు ఉంటాను !
నేను విశ్రాంతి తీసుకోను 
గమ్యం వైపు ప్రయాణిస్తూ ఉంటాను !
నేను మూఢాచారిని కాను 
శాస్ర్త విజ్ఞానం వైపు ఉంటాను !
నేను బానిసను కాను 
బానిసత్వంపై పోరాడుతూ ఉంటాను !
నేను సోమరిని కాను 
ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉంటాను !
నేను ఒంటరిని కాను 
ఎప్పుడూ సంఘంతో ఉంటాను !
నేను సమస్య కాను 
సమస్య పరిష్కారం వైపు ఉంటాను !
నేను ఎందుకిలా ఉంటానంటే నేను మంచి ,మానవత్వం వైపు వున్న మనుషుల వైపు ఉంటాను కనుక ! నేను సామాజిక స్పృహ కలిగిన మనుషుల వైపు ఉంటాను కనుక ! నేను ప్రతి క్షణం ఆనందంగా ఉండే మనుషుల వైపు ఉంటాను కనుక ! నేను ప్రతి పనిని అద్భుతంగా చేసే మనుషుల వైపు ఉంటాను కనుక ! నేను వ్యక్తిత్వ వికాసం నేర్పాటమే కాక ఆచరించే మనుషుల వైపు ఉంటాను కనుక ! నేను ప్రతి క్షణం నా ఎరుక లో నేను ఉంటాను కనుక!


మరింత సమాచారం తెలుసుకోండి: