made for each other Indian couples కోసం చిత్ర ఫలితం

భారతీయ సాంప్రదాయ సమాజములో బార్య భర్తల భాందవ్యం వైవాహిక వ్యవస్థ ద్వారా ముడిపడి ఉంటుంది. దానికి కాంట్రాక్టులు అగ్రిమెంటులు ఉండవు. ఈ బందం మతసాంస్కృతికమైనది. ఈ బందం శృంగారంలో తృప్తి తో తీరేది కాదు. కాని సామాజిక జీవన విధానం తో ముడిపడి ఉంది. ఋగ్వేదం లోని అపస్థంభ ధర్మాధికరణ లో ప్రకటించినట్లు భార్యా భర్తల భందాన్ని ధర్మం నిర్దేసిస్తుంది. వివాహ సమయం లో భర్త భార్య తో గృహ యజమానిగా భాధ్యతలు నిర్వహిస్తానని వాగ్ధాన భంగం రానివ్వనని నేను నిన్ను సంసారమనే గొప్ప అదృష్టం పొందటానికి వివాహం చేసుకుంటున్నానని, బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మనం కలసి జీవిద్ధామని అంతవరకు నీ చేయి విడవనని వదలివేయనని వాగ్ధానం చేస్తాడు. అందుకే వాగ్ధానం నిలుపుకోవటానికి భార్యతొ ప్రశాంతత కోల్పోకుండా ఉండటానికి కొన్ని సూచనలు: అప్పుడు గృహమేకదా స్వర్గ సీమ! కాదా? 

సంబంధిత చిత్రం

1) ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి.
2) ఆవిడ సమస్యలు చెబుతున్నప్పుడు, పేపర్ చదవడం ఆపండి.
3) ఆవిడ చూస్తున్న టివి ఛానల్ మార్చకండి.
4) ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి.
5) చేసిన కూర నచ్చకపోతే, నువ్వూ చేసినట్టు లేదేమీటి? "అనండి.


made for each other Indian couples in real life  కోసం చిత్ర ఫలితం

6. బాత్రూం క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి.
7. ఆమె పుట్టినరోజు గుర్తు పెట్టుకొని గ్రీట్ చేయండి.
8. మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు, పోన్ ఎత్తకండి.
9) రాత్రి ఆలస్యమయితే ముందుగా పోన్ చేసి చెప్పండి.
10. పిల్లల కన్నా ఆమె మీకు ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి.


greeting a wife on her birthday కోసం చిత్ర ఫలితం

11. ఉదయం ఆమె కన్నా ముందు లేస్తే కాఫీ కలపండి.
12. వారానికి ఓసారయినా బయట రెస్టారెంట్ కి, తీసుకు వెళ్ళండి.
13. ఆమెతో బయటకి వెళ్ళినపుడు, పక్క చూపులు చూడకండి.
14. వారానికి నాలుగుసార్లు ఆమెతో కలసి భోజనం చేయండి.
15. ఆమె మూడు బాగా లేనప్పుడు ఏమి జరిగిందని అడగండి


with wife in restaurent కోసం చిత్ర ఫలితం

16. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి.
17. ఎట్టి పరిస్థితులలోను మాట్లాడుకోని పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడండి.
18. మీ వాళ్ళకు ఏదయినా ఇవ్వాలనుకొన్నప్పుడు ఆమెకు చెప్పండి.
19. నిద్ర లేవగానే పక్క బట్టలు మీరే సర్ధండి
20. హోటల్ మెనూ కార్డ్ ఆమెకే ఇచ్చి ఆర్డర్ ఇవ్వమనండి.


with wife in restaurent కోసం చిత్ర ఫలితం

21. ఆమె ఇంగ్లీషులో వీక్ అయితే తప్పుని సరిదిద్ది, ఎంకరేజ్ చేయండి.
22. ఆమెకు తల నోప్పి ఉంటే అమృతాంజన్ రాయండి.
23. ఆమె సమస్యలు చెబుతున్న ప్పుడు, వాచి కేసి, టీవి. కేసి చూడకండి.
24. ఇవ్వి అన్ని చేసినా " నా భర్త చాలా మంచి వాడు" అంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి.. .

a beautiful indian couple కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: