నెల్లూరు జిల్లా కావలిలో పందుల బీభత్సం ఓ ముసలావిడ ప్రాణాలమీదికొచ్చింది. దారినపోతున్న ఆవిడను రెండు పందులు చుట్టుముట్టి గాయపరిచాయి. దీంతో వీధుల్లోకి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.

Image result for pigs at kavali

నెల్లూరు జిల్లాలో పందులు సైర్య విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కనిపించవారిపైన దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. కావలి మున్సిపాలిటి పరిధిలో ఈ పందుల బెడద మరీ ఎక్కువగా ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Image result for pigs at kavali

కావలిలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృధ్దురాలిపై పందులు దాడి చేసి గాయపర్చాయి. బాగా బలిసిన రెండు పందులు ముసలావిడను చుట్టుముట్టి కిందపడేసి గాయపరిచాయి. కొరిక కండ బయటకు వచ్చేలా లాగేశాయి. అసలే బక్కప్రాణం.. ఆపై పందుల దాడితో ఆ ముదుసలి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Image result for pigs at kavali

రోజువారి పనుల నిమిత్తం తన ఇంటినుంచి బయటకు వచ్చిన ఓ వృద్దురాలిపై పందులు ఆకస్మికంగా దాడి చేశాయి. అటుగా వెళ్తున్న వ్యక్తి కాపాడే ప్రయత్నం చేసినపప్పటికి దాడిని కొనసాగించాయి. దీంతో పందుల భారీ నుంచి తమ ప్రాణాలను కాపాడాలంటూ కావలి ప్రజలు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

Image result for kavali pigs

పందులను అరికట్టాలని ఎన్నిసార్లు చెప్పినా మున్సిపాలిటి అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఫిర్యాదు చేస్తున్నారు. వీధుల్లోకి రావాలంటేనే హడలిపోయే పరిస్థితి ఉందని వారంటున్నారు. పిల్లలను స్కూల్ కి పంపాలన్నా, బయటకు పంపాలన్నా భయమేస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

https://www.youtube.com/watch?v=zTN2tiv8VNU

 


మరింత సమాచారం తెలుసుకోండి: