అరటిపండుతో వచ్చే ప్రయోజనాలు అందరికీ తెలిసిన విషయమే అయినా అరటిపండు తొక్కతో మనకు లభించే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరూ ఈ అరటిపండు తొక్కను కూడా వదిలి పెట్టరు. అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.  అరటిపండు తొక్కతో మొటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలో మటుమాయం అయిపోతాయి. అలాగే ఎగ్‌ ‌వైట్‌ ‌లో అరటిపండు తొక్కతో గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అయిపోతాయి. 

అంతేకాదు నొప్పులు, వాపులు ఉన్న చోట అరటిపండు తొక్క గుజ్జుగా చేసి దానికి వెజిటబుల్ ఆయిల్ కలిపి మసాజ్ చేస్తే అవి మాయం అవుతాయి. దీనికితోడు అలర్జీలు దురదలు వచ్చేచోట అరటిపండు తొక్క గుజ్జును రాస్తే ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు రోజుకు రెండు అరటిపండు తొక్కలను తింటే ఆతోక్కలలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలు పెరిగి డిప్రెషన్ తగ్గుతుంది.

అలాగే క్యాన్సర్‌ కణతులు రాకుండా రక్షించే సమ్మేళనాలు అరటితొక్కలో ఉన్నాయి. అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి చూపు సమస్యలు రాకుండా ఈ అరటి తొక్కలు తినడం వల్ల ఫలితం ఉంటుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

అరటి తొక్కలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కంటిని కాపాడుతుంది. లుటీన్ దృష్టి సమస్యలను పోగొట్టడంతో పాటు కంటికి శుక్లాలు రాకుండా సహాయపడుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దితే దంతాలకు ఏర్పడ్డ సమస్యలు తీరడమే కాకుండా దంతాలు తెల్లగా మెరుస్తాయి. ఇలా అనేక ప్రయోజనాలుగల అరటిపండు తొక్కను తొక్కే కదా అని పడేయకుండా దీనిని ఉపయోగించుకుంటే మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్ర అధ్యయనాలు చెపుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: