కరివేపాకు  లేకుండా మన తెలుగు వారు ఎటువంటి కూరలను చేయరు. ఈ చెట్టు వేప చెట్టు ఫ్యామిలికి చెందింది. ముఖ్యంగా సౌత్ ఇండియా మరియు శ్రీలంకలో ఈ మొక్కలను  బాగా పెంచుతారు. అయితే ప్రతీ వంటలో ఉపయోగించే ఈ కరివేపాకులో ఉండే  మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ తెలుసుకుంటే  ఎవరైనా ఆశ్చర్యపోతారు. కరివేపాకు వంటలలో కేవలం సువానకు  మాత్రమే  కాదు  ఔషధగుణాలుండటం వల్ల దీనిని  ఎక్కువగా వినియోగిస్తుంటారు. కేవలం వంటలలో మాత్రమె కాకుండా   టీలు తయారీలో కూడా పురాతన కాలం నుండి  ఈ కరివేపాకును వాడుతున్నారు.


ముఖ్యంగా  డయాబెటిస్ నివారణకు  ఈ కరివేపాకుతో తయారు చేసిన  టీ  తీసుకుంటే డయాబెటిస్ నివారణకు సహాయపడటమే కాకుండా  మన శరీర  బరువు తగ్గడానికి కూడా ఈ టీ బాగా సహాయపడుతుంది.  అంతేకాదు ఈ కరివేపాకులో దాగున్న మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ గురించి అనేక ఆసక్తికర విషయాలు ఈ మధ్య లేటెస్ట్ పరిశోధనలలో వెల్లడి అవుతున్నాయి . ఎక్కువ ఆహార పదార్ధాలు  తినడం, మరియు  ప్రొసెస్ చేసిన ఫుడ్స్ తినడం వలన  మన  శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయి అనేక  అనారోగ్యాలు కలుగుతాయి.


 ఈ పరిస్థితులలో కరివేపాకు మన శరీరంలో పెరిగి పోయిన  రకాల టాక్సిన్స్ ను డిటాక్సి పై  చేస్తుంది.  అంతేకాదు మనసరీరం లోని  ఫ్యాట్ ను ఎక్కువగా కరిగించి క్రమంగా బరువు తగ్గిస్తుంది. కరివేపాకులో ఉండే హెర్బల్ మరియు మెడికల్ కాంపోనెంట్స్ వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. దీనికితోడు మనం ఎక్కువగా  షుగర్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. శరీరంలో చేరే ఎక్స్ ట్రా షుగర్ ఫ్యాట్ గా మారుతుంది. అది శరీరంలో చేరడంతో  అధిక బరువుకు కారణం అవుతుంది. కరివేపాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. దాంతో శరీరంలో ఫ్యాట్ పెరగకుండా నివారిస్తుంది.


 కరివేపాకులో కార్బోజోల్ ఆల్కలాయిడ్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. అలాగే శరీరం ఎలాంటి ఇన్ఫ్లమేషన్స్ మరియు ఇన్ఫెక్షన్స్ కు గురి కాకుండా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీనికితోడు ఉడికించిన కరివేపాకును పేస్ట్ లా చేసి గాయాల మీద కాలిన గాయాల మీద పుండ్లు మీద తెగిన గాయల మీద అప్లై చేస్తే ఆ గాయాలు త్వరగా మానిపోతాయి. అంతేకాదు కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణవాహికను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా ప్రేగులను స్ట్రాంగ్ గా మార్చుతుంది అని  పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. కరివేపాకులో విటమిన్ ఎ ఎక్కువగా  ఉండటం వల్ల  కంటి చూపును మెరుగుపడటమే కాకుండా  కళ్ళు ఒత్తిడి తగ్గుతుంది. కరివేపాకు పొడి తేనె మిశ్రమం కలిసి తీసుకుంటే చాలా అనారోగ్యాలకు పరిష్కారం దొరికినట్లే అని వైద్యులు కూడా చెపుతున్నారు.  దీనితో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కరివే పాకును మనం ప్రతీ రోజు తీసుకునే ఆహార పదార్ధాలలో ఎంత ఉపయోగిస్తే అంత మంచిది అని అంటున్నారు.. 



















మరింత సమాచారం తెలుసుకోండి: