రాముడు కృష్ణుడు గానే కాకుండా కత్తి పట్టుకుని జానపద సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. గ్రాఫిక్స్ లేని రోజులలో జానపద బ్రహ్మ విఠలాచార్యతో కలిసి ఎన్నో ప్రయోగాలు చేసారు ఎన్టీఆర్. ఆయన జానపద సినిమాలలో ‘చిక్కడు దొరకడు’ ఆరోజులలో సూపర్ హిట్ సినిమా.  ఈ సినిమా చాల సరదాగా ఉంటుంది. ఆ తరువాత ఈ టైటిల్ పై మోజుపడి రాజేంద్ర ప్రసాద్ కూడ ‘చిక్కడు దొరకడు’ టైటిల్ తో ఓ సినిమా చేసేసాడు. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు మళ్లీ చాన్నాళ్ల తరువాత అదే టైటిల్ తో మరో సినిమా వస్తోంది. ఇది సిద్దార్ధ సినిమా హిట్ కు మొహం వాచిపోయి ఉన్న సిద్దార్ధతో ‘పిజ్జా’ సినిమా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు తీస్తున్నతమిళ సినిమాఇది. ఈ సినిమాను తెలుగులో కుడా డబ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కు ‘చిక్కడు దొరకడు’ అనే టైటిల్ పెడుతున్నారు. ఈ సినిమా నేపథ్యం అంతా ఆంధ్రానే కావడంతో హైదరాబాద్, కర్నూలులో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో గజరాజు ఫేమ్ లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఆ మధ్య విశాల్ కు లిప్ లాక్ ఇచ్చి సంచలనం చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఈ సినిమాలో సిద్దార్థ్ ను ఏమి చేస్తుందో అంటూ సటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: