చిత్ర పరిశ్రమలో యస్.యం.యస్ మూవీతో తెరంగ్రేటం చేసిన హాట్ బ్యూటి రెజీనా కసాండ్రె. ఇప్పుడు ఈ బ్యూటికి మార్కెట్ లో గిరాకి బాగానే ఉంది. ముఖ్యంగా కుర్ర హీరోలకి హాట్ ఫేవరేట్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కొత్తజంటతో సినిమా తరువాత రెజీనాకు భారీగానే డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన రెజీనా-సందీప్ కిషన్ జంటగా నటించిన మూవీ రారా కృష్ణయ్య. ఈ మూవీలో వీరిద్దరి కాంబో అదరహో..అనిపించిదంటున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో రొటీన్ లవ్ స్టొరీ సినిమాలో కలసి నటించిన ఈ జంట అప్పట్లోనే బాగా క్లోజ్ అయ్యారట. ఇక ఈ సినిమా సమయానికి ఆ కెమిస్ట్రీ ‘తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు’ ఇంకా బాగా వర్క్ అవుట్ అయిందట. అంతే కాకుండా సందీప్ తో రెజీనా డేటింగ్ చేస్తుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో చిన్ని చిన్ని డ్రెస్సులతో రేజీనా రెచ్చిపోయింది. సందీప్ మాత్రం రెజీనా విషంలో ఎంత కూల్ గా ఉన్నప్పటికీ, రెజీనా మాత్రం సందీప్ ని రెచ్చగొడుతుందంట. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ ఎఫైర్ జోడి అని ఫిల్మ్ నగర్ టాక్. వీరిద్దరి ఎఫైర్ వ్వవహారం ఎంతవరకు దారి తీస్తుందో చూడాలని టాలీవుడ్ ఆసక్తిగా గమనిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: